AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips for Hiccups: ఎక్కిళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో బైబై చెప్పొచ్చు!

సాధారణంగా ఎక్కిళ్లు అనేవి అప్పుడప్పుడూ వస్తూ ఉంటాయి. ఎక్కిళ్లు వస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. పడుకోవాలన్నా.. కూర్చోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. గొంతులో నొప్పి కూడా వస్తుంది. కొన్నిసార్లు ఆగకపోతే ఏం జరుగుతుందోనని భయంగా కూడా అనిపిస్తుంది. ఎక్కిళ్లు ఎప్పుడైనా రావచ్చు. ఆ వివరాలు

Tips for Hiccups: ఎక్కిళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో బైబై చెప్పొచ్చు!
Hiccups
Ravi Kiran
|

Updated on: Jun 09, 2025 | 10:52 PM

Share

సాధారణంగా ఎక్కిళ్లు అనేవి అప్పుడప్పుడూ వస్తూ ఉంటాయి. ఎక్కిళ్లు వస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. పడుకోవాలన్నా.. కూర్చోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. గొంతులో నొప్పి కూడా వస్తుంది. కొన్నిసార్లు ఆగకపోతే ఏం జరుగుతుందోనని భయంగా కూడా అనిపిస్తుంది. ఎక్కిళ్లు ఎప్పుడైనా రావచ్చు. ఎక్కిళ్లు తగ్గడానికి చాలా మంది నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. పగలు అయితే పర్వాలేదు. కానీ రాత్రి పూట వచ్చాయంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరోవైపు యూరిన్ కూడా వస్తుంది. నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అసలు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి? ఇందుకు కారణం ఏంటి? మరి ఈ ఎక్కిళ్లను తగ్గించాలంటే ఎలాంటి చిట్కాలు అవసరమో ఇప్పుడు చూద్దాం.

ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి?

ఎక్కిళ్లు సర్వ సాధారణంగా వస్తూ ఉంటాయి. శరీరంలోని డయాఫ్రమ్ అనే కండరం లో కలిగే ఇబ్బందులు కారణం వల్లనే ఎక్కిళ్లు వస్తాయి. ఇది శ్వాస కోసం ఉపయోగ పడే కండరం. ఈ కండరం ఆకస్మాత్తుగా సంకోచించడం కారణంగా ఎక్కిళ్లు వస్తాయి.

ఎక్కిళ్లు రావడానికి కారణాలు?

ఎక్కిళ్లు రావడానికి ముఖ్య కారణం డయాఫ్రమ్ కండరం కాగా, ఇతర కారణాలు కూడా చాలానే ఉన్నాయి. వేగంగా తినడం వల్ల.. నీళ్లు కూడా వేగంగా తాగినా కడుపులో గాలి అనేది ఎక్కువగా చేరుతుంది. సోడా, బీర్ వంటి పానీయాలను ఎక్కువగా తాగడం వల్ల కూడా ఎక్కిళ్లు అనేవి వస్తాయి. ఆకలిగా ఉన్నప్పుడు తింటే కూడా పొలమారి ఎక్కిళ్లు వస్తాయి. అలాగే మసాలా ఆహారాలు తినడం వల్ల, ధూమపానం, ఒత్తిడి, ఆందోళన వంటి వాటితో బాధ పడటం వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.

ఎక్కిళ్లు తగ్గించుకోవడానికి చిట్కాలు:

* ఎక్కిళ్లు తగ్గించుకోవడానికి చాలా రకాల చిట్కాలు ఉన్నాయి. ఎక్కిళ్లు వస్తున్నప్పుడు నీటిని గొంతు దగ్గర కొన్ని సెకన్ల పాటు ఆపి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి.

* కూలింగ్ వాటర్ తాగడం వల్ల కూడా ఎక్కిళ్లు అనేవి తగ్గుతాయి. ఎక్కిళ్లు త్వరగా తగ్గాలంటే ఆహార పదార్థాలు ఏమన్నా తింటూ ఉండాలి. చక్కెర నోట్లో వేసుకుని నెమ్మదిగా నమలడం చేయాలి.

* బియ్యం తినడం వల్ల కూడా ఎక్కిళ్లు అనేవి తగ్గుతాయి. అలాగే చల్లటి నీటితో ముఖం కడిగినా, కొన్ని సెకన్ల పాటు శ్వాసను పట్టి ఉంచడం వల్ల కూడా ఎక్కిళ్లు కంట్రోల్ అవుతాయి.

* ఐస్ క్యూబ్‌ని నోట్లో వేసుకుని నెమ్మదిగా చప్పరించడం వల్ల కూడా ఎక్కిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక వెల్లుల్లి రెబ్బను తిన్నా, ఒక స్పూన్ నిమ్మ రసం తాగినా ఎక్కిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు