Apple – Diabetes: యాపిలా మజాకా.. డయాబెటిస్ రోగులు రోజూ ఒకటి తింటే ఏమవుతుందో తెలుసా..?

రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదని పేర్కొంటుంటారు.. ఈ మాట ఎక్కడో ఓ చోట వింటూనే ఉంటాం.. వైద్యులు కూడా తరచూ ఇలాంటి విషయాన్నే చెబుతుంటారు. అయితే, నిజంగానే యాపిల్స్ తినడం వల్ల చాలా రోగాలను దూరం చేసుకోవచ్చు.

Apple - Diabetes: యాపిలా మజాకా.. డయాబెటిస్ రోగులు రోజూ ఒకటి తింటే ఏమవుతుందో తెలుసా..?
Apple Diabetes
Follow us

|

Updated on: Apr 17, 2024 | 8:59 PM

రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదని పేర్కొంటుంటారు.. ఈ మాట ఎక్కడో ఓ చోట వింటూనే ఉంటాం.. వైద్యులు కూడా తరచూ ఇలాంటి విషయాన్నే చెబుతుంటారు. అయితే, నిజంగానే యాపిల్స్ తినడం వల్ల చాలా రోగాలను దూరం చేసుకోవచ్చు. డాక్టర్ల సూచన ప్రకారం.. డయాబెటిస్‌లో కూడా ఆపిల్ చాలా మేలు చేస్తుంది.. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచేందుకు పనిచేస్తుంది.. అంటే.. షుగర్ ను కంట్రోల్ చేసేందుకు యాపిల్ బాగా ఉపయోగపడుతుందని సర్వేలో కూడా తేలింది.

వాస్తవానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా పండ్లు తినాలి. తియ్యటి పండ్లు.. మామిడి, అరటి, దానిమ్మ సహజ చక్కెర ఎక్కువగా ఉండే వాటిని తినడం ప్రమాదమే.. ఈ పండ్లలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డయాబెటిస్ ఉంటే.. షుగర్ స్థాయి పెరుగుతుంది.. తినకూడని పండ్ల జాబితాలో ఆపిల్ లేదు. రోజూ ఒక యాపిల్‌ను క్రమం తప్పకుండా తినే మధుమేహ రోగి తన రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ ఉంచుకోవచ్చని అధ్యయనంలో తేలింది.

ఎందుకంటే..

యాపిల్స్ తక్కువ గ్లైసెలిక్ కలిగి ఉంటాయి. ఫలితంగా యాపిల్స్ తినడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అదనంగా, ఆపిల్లో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. పండులో కొవ్వు ఉండదు. కాబట్టి యాపిల్ ఫ్యాట్ కట్టర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆపిల్ బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు రాత్రి భోజనం తర్వాత తీపి తినాలనుకుంటే యాపిల్స్ తినవచ్చు. దీంతో ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

ఆపిల్ ఎలా తినాలి?

యాపిల్స్‌ను ఉడికించి తినవచ్చు. ఆపిల్ పై తయారు చేయవచ్చు. పుల్లటి పెరుగులో యాపిల్ ముక్కలను కలిపి తినొచ్చు.. బట్టర్ తో కూడిన ఆపిల్‌ను మధ్యాహ్నం స్నాక్‌గా తినవచ్చు. ఇది కొలెస్ట్రాల్ సమస్యలను పరిష్కరించగలదు. యాపిల్ జ్యూస్ తయారు చేసుకుని తాగవచ్చు. సమ్మర్ సీజన్ లో ఆపిల్ జ్యూస్ తయారు చేసి అందులో నిమ్మరసం కలపి తాగితే.. రిఫ్రెష్ అనుభూతి వస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
హైప్ పెంచేస్తున్న పుష్ప రాజ్.. ఆ భాషలోనూ రిలీజ్ కానున్న సినిమా
హైప్ పెంచేస్తున్న పుష్ప రాజ్.. ఆ భాషలోనూ రిలీజ్ కానున్న సినిమా
ట్యాబ్లెట్స్‌ ఉపయోగించకుండానే.. నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు!
ట్యాబ్లెట్స్‌ ఉపయోగించకుండానే.. నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు!
కేకేఆర్ స్టార్ బౌలర్‌కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు..
కేకేఆర్ స్టార్ బౌలర్‌కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు..
ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
నల్లని, మెరిసే ఒత్తైన జుట్టు కోసం కలబందను ఇలా ఉపయోగించాలి
నల్లని, మెరిసే ఒత్తైన జుట్టు కోసం కలబందను ఇలా ఉపయోగించాలి
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన ముంబై.. డేంజరస్ బౌలర్ల రీఎంట్రీ
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన ముంబై.. డేంజరస్ బౌలర్ల రీఎంట్రీ
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా..?
కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా..?
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!