AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urine Infection: మళ్లీ మళ్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం అదేనంట.. స్టడీలో షాకింగ్ విషయాలు..

యూరిన్ ఇన్‌ఫెక్షన్‌ మహిళలను వేధిస్తోన్న సమస్యల్లో ఒకటి. అయితే, ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 రకాల పరిశోధనల్లో కొన్ని మానసిక పరిస్థితుల వల్ల కూడా ఈ ఇన్‌ఫెక్షన్ వస్తుందని తేలింది.

Urine Infection: మళ్లీ మళ్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం అదేనంట.. స్టడీలో షాకింగ్ విషయాలు..
Urine Infection
Venkata Chari
|

Updated on: May 01, 2022 | 7:35 AM

Share

Urinary Tract Infection: యూరిన్ ఇన్ఫెక్షన్ మహిళలను పదే పదే ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి. ఆందోళన, డిప్రెషన్, మూత్రాశయానికి సంబంధించిన సమస్యలు, తరచుగా మూత్రవిసర్జన(Urine) వంటి మానసిక వ్యాధులు చుట్టుముట్టినట్లు అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఆరోగ్య నిపుణులు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఇదే విషయంపై ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 26 విభిన్న అధ్యయనాలలో ఇది తేలింది. మూత్రాశయం, డిప్రెషన్ మధ్య సంబంధం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆందోళనపై చేసిన 6 అధ్యయనాలలో, ఆందోళన ఉన్నప్పుడు కూడా, మూత్రాశయం ఓవర్ యాక్టివ్‌గా మారుతుందని, దాని వల్ల మళ్లీ మళ్లీ మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది.

పరిశోధనలో మరిన్ని షాకింగ్ విషయాలు..

భయం, డిప్రెషన్, మితిమీరిన మానసిక ఆందోళన వంటివి మూత్రాశయం పనితీరుపై ప్రభావం చూపుతాయని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది. మానసిక సమస్యలు మూత్ర ఇన్ఫెక్షన్, మూత్రాశయం, లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని యూరాలజిస్టులు కూడా అంగీకరించడానికి ఇదే కారణం.

యూరిన్ ఇన్ఫెక్షన్ నివారించే మార్గాలు..

మీకు తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చి మందులు వాడుతూ ఉంటే, అది కొంత వరకు తగ్గినా మళ్లీ వస్తుంది. కాబట్టి మీరు మీ మానసిక ఆరోగ్యంపై ఒక్కసారి శ్రద్ధ వహించాల్సి ఉంది. మీరు చాలా ఒత్తిడికి లోనవుతున్నారా లేదా ఆందోళన కారణంగా మీ తలపై భారం పడుతుందా అని గమనించండి. అవును అయితే, మీరు ఖచ్చితంగా ఈ విషయాలను మీ వైద్యుడికి చెప్పాల్సి ఉంటుంది.

1. మీరు ఎక్కువ నీరు తీసుకోవాలి. టీ, కాఫీలకు వీలైనంత దూరంగా ఉండండి.

2. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఒత్తిడిని తగ్గించి, మానసికంగా దృఢంగా మారేందుకు ఎంతగానో సహకరిస్తుంది.

3. గరిష్ట మొత్తంలో నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టదు.

4. డాక్టర్ పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్ తీసుకోండి.

5. ఏకాంతంలో గడపడం, ధ్యానం చేయాలి. ధ్యానం మానసికంగా దృఢంగా మారడానికి చాలా సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సలహాలుగా మాత్రమే తీసుకోవాలి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Health Tips: మీరు చేస్తున్న ఈ 4 తప్పుల వల్లే అధిక బరువు.. అస్సలు చేయవద్దు..!

Heatstroke: వడ దెబ్బ బారిన పడకుండా ఉండాలంటే.. ఈ ఆహారాలు తీసుకోండి..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు