30 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా ఉండాలంటే ఇవి తినడం మొదలు పెట్టండి
వయస్సు పెరిగే కొద్దీ ఒత్తిడి, జీవన విధానంలో మార్పులు, హార్మోన్ సమస్యల కారణంగా చర్మం ఆరోగ్యాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా 30 దాటిన తర్వాత చర్మం తన సహజ కాంతిని తగ్గించుకుంటుంది. ఈ పరిస్థితులను నియంత్రించాలంటే ఆహారంలో పౌష్టికమైన పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచేందుకు సహాయపడే కొన్ని ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ప్రభావితం చేసే మాలిన్యాలను తగ్గిస్తాయి. బొప్పాయి తినడం వల్ల చర్మం తాజాగా నిగారింపుగా కనిపిస్తుంది. రకరకాల కాలుష్యాల వల్ల చర్మం మురికిగా మారినప్పుడు బొప్పాయి దానికి సహజ చికిత్సగా మారుతుంది.
పాలకూరలో ఐరన్, ఫోలేట్ లాంటి ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచి చర్మానికి పోషణను అందిస్తాయి. వారానికి రెండు లేదా మూడు సార్లు పాలకూరను ఆహారంగా తీసుకుంటే చర్మం చక్కగా మెరుస్తుంది.
అవకాడోలో ఉండే మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్లు చర్మానికి తేమనిచ్చే పనిలో నిపుణుల్లా పని చేస్తాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా సున్నితంగా మారుతుంది. వయస్సుతో వచ్చే ముడతలను తగ్గించడంలో అవకాడో సహాయపడుతుంది.
బాదం, జీడిపప్పు, పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని దెబ్బతిన్న కణాలను మరల పునరుత్పత్తి చేస్తాయి. రోజూ కొద్దిగా ఇవి తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
గ్రీన్ టీలో ఉండే పాలీఫినాల్స్ శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి. శరీర శుద్ధి జరిగితే చర్మం సహజంగా మెరిసిపోతుంది. రోజు రెండు సార్లు గ్రీన్ టీ తాగడం ద్వారా చర్మం సజీవంగా మారుతుంది.
పెరుగు లాంటి పులియబెట్టిన పదార్థాలు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇది మానసికంగా తేలికగా ఉండడాన్ని కలిగించి చర్మానికి మెరుగైన ప్రభావాన్ని ఇస్తుంది. నిత్యం పెరుగు తీసుకోవడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
విటమిన్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే డార్క్ చాక్లెట్ తినడం వల్ల చర్మానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అయితే మితంగా మాత్రమే తీసుకోవడం మంచిది.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లాంటి బెర్రీస్ లో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపల నుంచి శుభ్రం చేయడంలో సహాయపడతాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గించడంలో ఇవి మద్దతిస్తాయి. 30 ఏళ్ల తరువాత కూడా చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పోషకాహారం చాలా ముఖ్యం. పై చెప్పిన సహజ పదార్థాలను ఆహారంలో చేర్చితే చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)