AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.. ఒకసారి ట్రై చేసి చూడండి

బరువు తగ్గాలని చాలా మంది ఆలోచిస్తారు. అయితే రోజువారీ ఆహారాన్ని పూర్తిగా త్యాగం చేయాల్సిన అవసరం లేదు. సరైన ఆహారపు ఎంపికలతో సులభంగా బరువు తగ్గవచ్చు. ఉదయం అల్పాహారంగా తీసుకునే దోశ కూడా బరువు తగ్గేందుకు సహాయకారి అవుతుందనేది చాలా మందికి తెలియదు.

బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.. ఒకసారి ట్రై చేసి చూడండి
Weight Loss Diet
Follow us
Prashanthi V

|

Updated on: May 08, 2025 | 5:12 PM

దోశను నూనె తక్కువగా వేసి సింపుల్‌గా చేస్తే అందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. మామూలుగా ఒక చిన్న దోశలో దాదాపు 90 నుండి 110 క్యాలరీలు ఉంటాయి. ఇది మన రోజువారీ అవసరాలకు తక్కువగా ఉంటుంది కాబట్టి శరీరంలో ఎక్కువ శక్తి నిల్వ ఉండదు. దోశ తయారీలో ఉపయోగించే మినప్పప్పు, బియ్యం వంటి పదార్థాల వల్ల ఇందులో సహజంగా ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలు దూరం చేస్తుంది. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.

అధిక నూనెతో తినే దోశలు బరువు పెరగడానికి దోహదపడతాయి. కానీ ప్లెయిన్ దోశను తక్కువ నూనెతో తయారు చేస్తే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నూనె బదులు నాన్‌స్టిక్ పాన్‌లో వేయడం వల్ల శరీరానికి అవసరం లేని కొవ్వులు నుంచి బయటపడవచ్చు.

దోశ తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటానికి సహాయపడుతుంది. దీనివల్ల అర్ధరాత్రి లైట్ స్నాక్స్ అవసరం తక్కువగా ఉంటుంది. ఈ అలవాటు శరీర బరువును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.

దోశతో పాటు మసాలా కూరలు, మాంసాహార ఐటెమ్స్ కాకుండా సాంబార్, టొమాటో, పుదీనా వంటి తేలికపాటి పచ్చడులను వాడితే శరీరానికి తక్కువ శక్తి వచ్చి అధిక ప్రోటీన్ లభిస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.

బరువు తగ్గే ఉద్దేశంతో ఒకేసారి ఎక్కువ దోశలు తినడం మేలుకాదు. రోజుకు ఒకటి లేదా రెండు దోశలు సరిపోతుంది. భోజనంలో ఇతర పదార్థాలతో సమతుల్యత పాటించాలి. ముఖ్యంగా పగటి వేళల్లో మాత్రమే దోశ తీసుకోవాలి. రాత్రిపూట తిన్నట్లయితే శరీరానికి కేలరీలు పూర్తిగా వినియోగం కాకపోవచ్చు.

ప్రతి ఒక్కరి శరీర పరిస్థితి వేరు. అందుకే ఏ ఆహారం సరిపోతుందో తెలుసుకునే ముందు ఒకసారి వైద్య సలహా తీసుకోవడం మంచిది. ఎవరైనా డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆహారపు నియమాలను పాటించడం అవసరం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)