AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gongura Rice: నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర రైస్! బ్యాచిలర్స్ సైతం చిటికలో చేసేయచ్చు 

ఆంధ్ర వంటకాల ప్రత్యేకతైన గోంగూరతో చేసే గోంగూర రైస్ రుచికి మారు పేరు. పుల్లటి, కారంగా ఉండే ఈ వంటకం లంచ్ బాక్స్‌లకు అద్భుతంగా సరిపోతుంది. తక్కువ సమయంలో సులభంగా తయారయ్యే ఈ రెసిపీ బ్యాచిలర్స్‌కు కూడా ఎంతో ఉపయోగకరం. పెరుగు రైతాతో కలిపి తింటే గోంగూర రైస్ రుచి మరింత పెరుగుతుంది.

Phani CH
|

Updated on: May 30, 2026 | 6:49 PM

Share
ఆంధ్రా వంటకాల్లో గోంగూరకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర చికెన్ ఇలా రకరకాల వంటకాలు మన నోటికి ఎంతో రుచిని అందిస్తాయి. అయితే, ఎప్పుడూ ఒకేలాంటి పులిహోర లేదా ఫ్రైడ్ రైస్ కాకుండా, కాస్త వెరైటీగా, కారంగా, పుల్లగా ఉండే గోంగూర రైస్ తింటే ఆ మజానే వేరు. లంచ్ బాక్స్‌లకు ఎంతో అనువుగా, బ్యాచిలర్స్ సైతం సులభంగా చేసుకునేలా ఉండే ఈ వంటకం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఈ రెసిపీకి కావలసిన ముఖ్యమైన పదార్థాలు- బాగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు, పొడిపొడిగా వండుకున్న అన్నం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, నూనె మరియు తాలింపు దినుసులు (ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయిమినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి).

2 / 5
ముందుగా ఒక బాణలిలో తగినంత నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మొదట ఆవాలు వేసి బాగా చిటపటలాడే వరకు వేయించాలి. ఆవాలు సరిగ్గా వేగకపోతే అన్నం చేదుగా తగులుతుందని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మిగిలిన తాలింపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. తాలింపు ఎంత బాగా వేగితే అన్నానికి అంత చక్కని రుచి వస్తుంది.

3 / 5
తరువాత కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి బాగా కలుపుతూ మగ్గించుకోవాలి. గోంగూర ఎంత ఎక్కువగా వేసినా, అది ఉడికిన తర్వాత పరిమాణంలో చాలా కొంచెంగా మారిపోతుంది.గోంగూర మగ్గుతున్నప్పుడు అందులో తగినంత ఉప్పు, పసుపు వేయాలి. ఉప్పు వేయడం వల్ల ఆకులోని నీరంతా బయటకు వచ్చి త్వరగా మెత్తబడుతుంది.

4 / 5
ఆ తర్వాత కొద్దిగా కారం వేసి, నూనె పైకి తేలేంత వరకు గోంగూరను బాగా ఉడికించుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి కలిపితే గోంగూర మిశ్రమం సిద్ధమవుతుంది. ఈ మిశ్రమాన్ని ముందుగానే వండి చల్లారబెట్టుకున్న పొడిపొడి అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ గోంగూర రైస్‌లోకి క్యారెట్, కీరా, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి చేసిన పెరుగు చట్నీ (రైతా) నంజుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. రాత్రిపూట మిగిలిపోయిన అన్నంతో కూడా ఉదయాన్నే ఇలా చకచకా గోంగూర రైస్ చేసుకోవచ్చు. 

5 / 5
Follow Us
నిర్జల ఏకాదశి రోజున లక్ష్మీ-నారాయణ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ధనం

ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ శాంతి మండలి అత్యున్నత పురస్కారం..

ఫిఫా వరల్డ్ కప్‌లో విచిత్రం.. నోరు మూసుకున్నందుకు రెడ్ కార్డ్

Weekly Horoscope: హమ్మయ్య.. వారికి ఆర్థిక కష్టాలు తీరిపోతాయ్..

ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1,000 ఉచిత యోగా సెషన్లు

కెరీర్‌లో తొలిసారి ఇలా.. గిల్ దోస్త్ దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్..

నిర్జల ఏకాదశి.. ఒక్క ఉపవాసంతో 26 ఏకాదశుల పుణ్యం.. ఈ మహా వ్రతం..

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముస్తాబైన కోల్‌కతా

ఫౌండేషన్ వేసుకుంటే ముఖం ప్యాచీగా మారుతోందా? పార్లర్ లాంటి గ్లో

అతి తక్కువ వడ్డీకే హెమ్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఇవే..