AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H3N8 Bird Flu: ముంచుకొస్తున్న మరో వైరస్ ముప్పు.. పక్షుల కారణంగానే ప్రమాదం..చైనాలో మొదటి మరణం..

హెచ్3ఎన్8 పేరుతో వ్యాప్తిస్తున్న ఈ వైరస్ వల్ల ఇప్పటికే చౌనాలో ఓ మరణం సంభవించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదికల ప్రకారం మార్చి 27న చైనాలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా ఏ (హెచ్3ఎన్8) వైరస్‌తో బాధపడుతున్న ఒక మహిళ మరణించింది. ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా ఏ వైరస్‌‌కు సంబంధించిన మూడు కేసులు ఇప్పటికే చైనాలో నమోదయ్యాయి.

H3N8 Bird Flu: ముంచుకొస్తున్న మరో వైరస్ ముప్పు.. పక్షుల కారణంగానే ప్రమాదం..చైనాలో మొదటి మరణం..
H3n8
Nikhil
|

Updated on: Apr 13, 2023 | 5:00 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయం ఎవరూ మర్చిపోరు. అన్ని దేశాలు కఠినమైన లాక్‌డౌన్ పెట్టి, అలాగే కరోనా నియంత్రణకు వ్యాక్సిన్లు ఇచ్చి అదుపులో ఉంచాయి. అయినా ఇప్పటికీ కరోనా చాయలు ప్రపంచాన్ని వదల్లేదు. ముఖ్యంగా కరోనా కారణంగా అన్ని దేశాల్లో ఆర్థిక రంగం కుదేలైంది. ఇంతటి వినాశనానికి కారణమైన కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందని చాలా మంది వాదన. ఇప్పుడు అదే చైనాలో ఓ కొత్త రకమైన వైరస్ విజృంభిస్తుంది. హెచ్3ఎన్8 పేరుతో వ్యాప్తిస్తున్న ఈ వైరస్ వల్ల ఇప్పటికే చౌనాలో ఓ మరణం సంభవించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదికల ప్రకారం మార్చి 27న చైనాలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా ఏ (హెచ్3ఎన్8) వైరస్‌తో బాధపడుతున్న ఒక మహిళ మరణించింది. ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా ఏ వైరస్‌‌కు సంబంధించిన మూడు కేసులు ఇప్పటికే చైనాలో నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి వ్యక్తికి సులభంగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉండదని, ప్రజలు భయపడాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మానవుల్లో ఈ వైరస్ వ్యాప్తి ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది. అయితే మరణించిన మహిళ వయస్సు 56 ఏళ్లు ఉంటాయని, ఆమె తీవ్రమైన న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరిందని తెలుస్తోంది. ముఖ్యంగా రోగికి అనేక అంతర్లీన పరిస్థితులు ఉన్నాయని, అలాగే వ్యాధి ప్రారంభానికి ముందు ప్రత్యక్ష పౌల్ట్రీకి గురైన చరిత్ర ఉందని డబ్ల్యూహెచ్ పేర్కొంటుంది. 

హెచ్3ఎన్8 అంటే ఏంటి?

హెచ్3ఎన్8 వైరస్‌ను మొదటిసారిగా 2002లో ఉత్తర అమెరికా వాటర్‌ఫౌల్‌లో మొదట కనుగొన్నారు. ఇది గుర్రాలు, కుక్కలు, సీల్స్‌కు సోకుతుంది. ఈ వైరస్ సాధారణంగా జంతువుల్లో కనిపించినా పక్షుల్లో ఈ వైరస్ ఉపరకాలు కనిపిస్తాయి. దీని వల్ల పౌల్ట్రీ లేదా అడవి పక్షులలో వ్యాధి సంకేతాలు తక్కువగా ఉంటాయి. పక్షుల నుంచి మానవులకు ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ల ప్రసారం సాధారణంగా అప్పుడప్పుడు మరియు ఒక నిర్దిష్ట సందర్భంలో జరుగుతాయి. చాలా కేసులు పౌల్ట్రీల వద్ద కలుషితమైన వాతావరణాలకు గురికావడం వల్ల సంభవించాయి. ఈ వైరస్ సోకిన వారిలో కండ్లకలక, తేలికపాటి ఫ్లూ-వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే ఒక్కోసారి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి కారణంగా మరణం కూడా సంభంవించే అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణశయాంతర లేదా నాడీ సంబంధిత లక్షణాలు కూడా ఈ వ్యాధి లక్షణాలు వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఈ వైరస్‌పై ఇంకా పరిశోధనలు జరిగితే మానవాళి ఎంత నష్టం చేకూరుస్తుందో? పేర్కొనలేమని డబ్ల్యూహెచ్ఓ నివేదిస్తుంది. అయితే ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌లకు వ్యతిరేకంగా వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ హెచ్3ఎన్8 ఇన్‌ఫ్లుఎంజా ఏ వైరస్‌కు మాత్రం ఎలాంటి వ్యాక్సిన్ లేదు.

ఇవి కూడా చదవండి

జాగ్రత్తలు ఇలా

  • తరచుగా చేతులు కడుక్కోవడం లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించాలి.
  • ముఖ్యంగా లైవ్ యానిమల్ మార్కెట్‌లు/ఫారమ్‌లు, లైవ్ పౌల్ట్రీ లేదా పక్షి మలం ద్వారా కలుషితమైన ఉపరితలాలు వంటి వాటికి దూరంగా ఉండాలి.
  • జంతు ఇన్ఫ్లుఎంజా వ్యాప్తి చెందుతున్న దేశాలకు వెళ్లేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ముఖ్యంగా ప్రయాణికులు సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవాలి. అలాగే మంచి ఆహార పరిశుభ్రత పద్ధతులను అనుసరించాలి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం