AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ నాలుకపై ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాల్సిందే.. ఆ విటమిన్ లోపం ఉన్నట్టే..

సాధారణంగా శరీరానికి కావాల్సిన విటమిన్ డి తగినంత సమయం సూర్యరశ్మిలో గడపడం వల్ల వస్తుంది. అలాగే పాలు, చేపలు, చేప నూనెలు, గుడ్డు సొనలు వంటి కొన్ని ఆహారాల ద్వారా ఇది సహజంగా శరీరానికి అందుతుంది. అలాగే విటమిన్‌-డి వల్ల ఎముకలు, దంతాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంటాయి.

Health Tips: మీ నాలుకపై ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాల్సిందే.. ఆ విటమిన్ లోపం ఉన్నట్టే..
Tongue
Nikhil
| Edited By: |

Updated on: Apr 14, 2023 | 1:23 PM

Share

సాధారణంగా మన శరీరంలోని లోపాలను వివిధ సంకేతాల ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ల లోపాన్ని నిర్ధారించడానికి కొన్ని పద్దతులు ఉన్నా.. విటమిన్ డి లోపం నిర్ధారించడానికి మాత్రం కచ్చితంగా పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. అయితే విటమిన్ డి లోపాన్ని కూడా శరీరంలోని కొన్ని సంకేతాల గుర్తించవచ్చని పేర్కొంటున్నారు. సాధారణంగా శరీరానికి కావాల్సిన విటమిన్ డి తగినంత సమయం సూర్యరశ్మిలో గడపడం వల్ల వస్తుంది. అలాగే పాలు, చేపలు, చేప నూనెలు, గుడ్డు సొనలు వంటి కొన్ని ఆహారాల ద్వారా ఇది సహజంగా శరీరానికి అందుతుంది. అలాగే విటమిన్‌-డి వల్ల ఎముకలు, దంతాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే శరీరంలోని కాల్షియం, ఫాస్ఫేట్ విటమిన్-డి నియంత్రిస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నవారు ముఖ్యంగా ఎముక వైకల్యంతో ఇబ్బందిపడతారు. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమైన విటమిన్ -డి లోపంతో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇబ్బందిపడతారు. విటమిన్ డి లోపంతో బాధపడేవారిలో కనిపించే సూచనలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

బర్నింగ్ మౌత్ సిండ్రోమ్

బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ లేదా బీఎంఎస్ అనేది నోటిలో మంట లేదా జలదరింపుగా వర్ణించబడని ఓ బాధాకరమైన పరిస్థితిగా ఉంటుంది. నొప్పితో పాటు మీరు నోరుగా పొడిగా మారడం, నోటిలో మార్పు చెందిన రుచిని కూడా అనుభవించవచ్చు.అధ్యయనాల ప్రకారం, విటమిన్ బీ6, విటమిన్ బీ1, జింక్‌తో పాటు ఇతర విటమిన్లు, ఖనిజాల లోపాల వల్ల కూడా నాలుక మంట లేదా నోటిలో మంట సిండ్రోమ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్‌ సమస్య వల్ల కూడా ఈ పరిస్థితి సంభవిస్తుంది. అలాగే గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు కూడా కారణంగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్-డి లోపం వల్ల మన నోటిలో కలిగే ఇబ్బందులను ఓ సారి చూద్దాం.

తిమ్మిరి

మీ శరీరంలో విటమిన్ డి చాలా తక్కువగా ఉంటే శరీరం స్వయంచాలకంగా రక్తంలో తక్కువ కాల్షియం స్థాయిలను కలిగి ఉంటుంది. ఇది మీ నాలుకపై తిమ్మిరి లేదా అనుభూతి లేకపోవడం వంటి లక్షణాలను కలుగజేస్తుంది. 

ఇవి కూడా చదవండి

నాలుక, నోరు పొడిబారడం

నాలుక పొడిబారడం అనేది మీరు అనుభవించే విటమిన్ డి లోపం యొక్క మరో లక్షణం. ఈ లక్షణం అనుభవించిన వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. పొడి నోరు లేదా జిరోస్టోమియాకు విటమిన్ లోపాలతో పాటు డీహైడ్రేషన్, ఆల్కహాల్ వాడకం, ధూమపానం, ఆందోళన, కొన్ని మందుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. విటమిన్ డి లోపం వల్ల నోరు పొడిబారడం వల్ల మీ కావిటీస్, నోటి వ్యాధులు, అనేక ఇతర సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

లోపం నుంచి బయటపడాలంటే ఇవి తప్పనిసరి

ప్రతిరోజు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తలు తీసుకుంటే విటమిన్-డి లోపం నుంచి త్వరగా బయటపడవచ్చు. కచ్చితంగా రోజుకు 10-20 నిమిషాల పాటు ఎండలో గడపాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆహారంలో కూడా పాలకూర,బెండకాయ, సోయాబీన్స్, తెలుపుబీన్స్, చేప వంటివి ఉండేలా చూసుకోవాలని పేర్కొంటున్నారు. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా ఆరోగ్య పరమైన సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..