Beetroot Benefits: బీట్‌రూట్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ రోగులకు దివ్యఔషధమే..
బీట్‌రూట్, బచ్చలికూర, పాలకూరలో లభించే డైటరీ నైట్రేట్‌పై చేసిన తాజా పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. వ్యాయామానికి ముందు వీటిని తీసుకుంటే ఓర్పు, అధిక-తీవ్రతతో కూడిన వ్యాయామ పనితీరును మెరుగుపరుస్తుందని వెల్లడైంది.

బలమైన కండరాలు శారీరక దృఢత్వానికి చాలా అవసరం. కండరాలు కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేస్తాయి. అయితే బీట్‌రూట్ రసం మీ కండరాల బలాన్ని మీ హృదయ ఆరోగ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బీట్‌రూట్, బచ్చలికూర, పాలకూరలో లభించే డైటరీ నైట్రేట్‌పై చేసిన తాజా పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. వ్యాయామానికి ముందు వీటిని తీసుకుంటే ఓర్పు, అధిక-తీవ్రతతో కూడిన వ్యాయామ పనితీరును మెరుగుపరుస్తుందని వెల్లడైంది. ముఖ్యంగా బీట్‌రూట్ రసాన్నివినియోగిస్తే డైటరీ నైట్రేట్ సప్లిమెంటేషన్‌తో వ్యాయామ పనితీరులో గణనీయమైన మెరుగుదల ఉంటుందని నిపుణులు నివేదిస్తున్నారు. ఇలా తీసుకున్న వారిలో కండరాల బలం ఏడు శాతం పెరిగినట్లు కనుగొన్నారు. కండరాలు నైట్రేట్‌ను నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చడం ద్వారా సంకోచించే సామర్థ్యం మెరుగు అవుతుంది. ఈ విషయం కచ్చితంగా గుండె జబ్బులతో బాధపడేవారికి ఒక వరంలాంటిదని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా శిక్షణ పొందిన అథ్లెట్లు, చురుకైన వ్యక్తులలో డైటరీ నైట్రేట్ పనితీరును పెంచుతుంది.