Detox Drinks: భగ భగ మండే వేసవిలో హైడ్రేట్ గా ఉండాలనుకుంటున్నారా..అయితే ఈ 5 డిటాక్స్ డ్రింక్స్ మీ కోసం..

వేసవిలో ప్రజలు ఎక్కువగా ఆరోగ్యకరమైన, చల్లని పానీయాలు తీసుకుంటారు. ఇందులో కొబ్బరి నీరు, చెరుకు రసం, మజ్జిగ ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి కాకుండా డైట్‌లో కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను చేర్చుకోవచ్చు.

Prudvi Battula

|

Updated on: Apr 13, 2023 | 2:51 PM

వేసవిలో ప్రజలు ఎక్కువగా ఆరోగ్యకరమైన, చల్లని పానీయాలు తీసుకుంటారు. ఇందులో కొబ్బరి నీరు, చెరుకు రసం, మజ్జిగ ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి కాకుండా డైట్‌లో కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను చేర్చుకోవచ్చు.

వేసవిలో ప్రజలు ఎక్కువగా ఆరోగ్యకరమైన, చల్లని పానీయాలు తీసుకుంటారు. ఇందులో కొబ్బరి నీరు, చెరుకు రసం, మజ్జిగ ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి కాకుండా డైట్‌లో కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను చేర్చుకోవచ్చు.

1 / 7
నిమ్మకాయ, పుదీనా, దోసకాయలని ఉపయోగించి ఈ పానీయాలు తయారుచేస్తారు. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అంతేకాదు బరువు కూడా తగ్గిస్తాయి. ఈ ఆరోగ్యకరమైన పానీయాలు శరీరానికి పోషకాలను అందిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

2 / 7
దోసకాయ డిటాక్స్ డ్రింక్  ఈ పానీయం చేయడానికి ఒక దోసకాయను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో గ్లాసు నీరుపోయాలి. అలాగే నిమ్మకాయ, కొన్ని పుదీనా ఆకులను జోడించాలి. రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి ఉదయం ఇందులోని నీటిని తాగాలి.

3 / 7
దాల్చిన చెక్క డిటాక్స్ డ్రింక్  యాపిల్, దాల్చిన చెక్క కలయిక వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆపిల్, నిమ్మకాయని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో గ్లాసు నీరు పోసి యాపిల్ ముక్కలు, దాల్చిన చెక్క, పుదీనా ఆకులు, అల్లం ముక్కలు, నిమ్మకాయ ముక్కలు అందులో వేయాలి. 6 నుంచి 7 గంటలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఫిల్టర్ చేయాలి. అందులో కొంచెం తేనె కలుపుకుని తాగాలి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

4 / 7
చియా సీడ్స్ డిటాక్స్ డ్రింక్  చియా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని సూపర్ ఫుడ్‌ అని పిలుస్తారు. ఒక చెంచా చియా గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. వాటిలో నిమ్మకాయ ముక్కలని వేయాలి. ఒక గంట వదిలేయాలి. ఆ తర్వాత తినాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

5 / 7
మెంతి డిటాక్స్ డ్రింక్  ఈ పానీయం చేయడానికి రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా మెంతి గింజలను నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం మెంతి గింజలను ఫిల్టర్ చేయండి. ఈ నీటిలో నిమ్మరసం కలపండి. తర్వాత తాగండి.

6 / 7
ధనియాల నీరు  ఈ పానీయం చేయడానికి ఒక టీస్పూన్ ధనియాలు తీసుకొని ఓ గిన్నెలో వేయండి. అందులో గ్లాసు నీరు పోసి రాత్రంతా ఉంచండి. ఉదయాన్నే వడబోసి ఆ నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది.

7 / 7
Follow us