AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఉసిరి, కరివేపాకు కలిపి తీసుకుంటే ఇన్ని లాభాలా.. ఈ వ్యాధి ఉన్నవారికి వరం

సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడంలో సరైన ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. న్యూట్రిషనిస్ట్ దీప్‌శిఖ జైన్, ఆహారాల విభిన్న కలయికల ద్వారా లభించే అద్భుత ప్రయోజనాల తెలియజేస్తూ... యూకే నుండి గ్లోబల్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో ఎంఎస్‌సీ చేసిన దీప్‌శిఖ ఉసిరి, కరివేపాకు గురించి పలు కీలక విషయాలు చెప్పారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ఈ రెండు పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలను వివరించారు.

Health: ఉసిరి, కరివేపాకు కలిపి తీసుకుంటే ఇన్ని లాభాలా.. ఈ వ్యాధి ఉన్నవారికి వరం
Amla And Curry Leaves Benefits
Bhavani
|

Updated on: Jul 16, 2025 | 7:18 PM

Share

సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడంలో సరైన ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. న్యూట్రిషనిస్ట్ దీప్‌శిఖ జైన్, ఆహారాల విభిన్న కలయికల ద్వారా లభించే అద్భుత ప్రయోజనాల తెలియజేస్తూ… యూకే నుండి గ్లోబల్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో ఎంఎస్‌సీ చేసిన దీప్‌శిఖ ఉసిరి, కరివేపాకు గురించి పలు కీలక విషయాలు చెప్పారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ఈ రెండు పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలను వివరించారు

ఉసిరి, కరివేపాకుతో లభించే ప్రయోజనాలు:

ఆరోగ్యకరమైన జుట్టు: ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉండగా, కరివేపాకు బీటా కెరోటిన్‌కు మంచి వనరు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది, జుట్టు బలంగా మారుతుందని న్యూట్రిషనిస్ట్ తెలిపారు. “ఇవి మీ జుట్టును నిజంగా మెరుగుపరుస్తాయి, బలోపేతం చేస్తాయి. అంతేకాక, అకాల జుట్టు తెల్లబడడాన్ని కూడా తగ్గిస్తాయి” అని ఆమె అన్నారు.

మధుమేహ నియంత్రణ: “ఈ అద్భుత కలయిక మధుమేహాన్ని నియంత్రించగలదు, రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించగలదు. ఈ రెండూ ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది” అని న్యూట్రిషనిస్ట్ పేర్కొన్నారు.

యాంటీఆక్సిడెంట్లు పుష్కలం: ఉసిరి, కరివేపాకు రెండూ యాంటీఆక్సిడెంట్లకు నిలయం అని దీప్‌శిఖ తెలిపారు. యాంటీఆక్సిడెంట్లు అంటే విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు లాంటి పోషకాలు. ఇవి కణాలను రోజువారీ నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చర్మానికి మెరుపును ఇవ్వడంలో సహాయపడతాయని న్యూట్రిషనిస్ట్ వివరించారు.

ఎలా తీసుకోవాలి? ఈ రెండింటినీ కలిపి తీసుకోవడానికి ఉత్తమ మార్గాన్ని న్యూట్రిషనిస్ట్ సూచించారు. “మీరు దీన్ని ఒక షాట్‌గా తాగవచ్చు లేక మీ కూరగాయల జ్యూస్‌లో కలుపుకోవచ్చు” అని ఆమె సలహా ఇచ్చారు. ఈ సులభమైన చిట్కా మీ రోజువారీ ఆహారంలో ఈ శక్తివంతమైన కలయికను చేర్చుకోవడానికి సహాయపడుతుంది.