వర్షాకాలంలో బోడ కాకరకాయ దివ్యఔషదం.. అనారోగ్యానికి యమరాజు..
బోడ కాకరకాయ చూడటానికి ఆకుపచ్చగా, గుండ్రంగా, సుతిమెత్తగా ఉంటుంది. దీనితో చేసుకొన్న కూర ఎంతో రుచికరంగా ఉంటుంది. కాకరకాయ వాలే దీంతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా వానాకాలంలో తినడం మరింత ఆరోగ్యం. వర్షాకాలంలో బోడ కాకరకాయతో ఎలాంటి లాభాలు ఉంటాయి.? ఈరోజు తెలుసుకుందామా మరి.
Updated on: Jul 16, 2025 | 8:12 PM

బోడ కాకరకాయలో చికెన్, మటన్ లాంటి మాంసాహారాల్లో కూడా లేని పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా వర్షకాలంలో బోడ కాకర తింటే వైరల్ ఇన్ఫెక్షన్‌లు దరిచేరవు. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ డైట్‌లో బోడకాకరను చేర్చుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

బోడకాకరలోని విటమిన్స్, అమైనో ఆమ్లాలు, ప్లేవనాయిడ్స్, పోటాషియం, ఫాస్పరస్ లాంటివి పుష్కలంగా లభిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు వర్షాకాలంలో దీన్ని తీసుకొంటే రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో గ్లైసెమిక్ తక్కువగా ఉన్న కారణంగా మధుమేహులకు మేలు చేస్తుంది.

ఇందులో విటమిన్ సీతో పాటు ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫాస్పరస్ లాంటి వాటిని ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి క్యాన్సర్ లాంటి సమస్యలు దరి చేరకుండా కాపాడుతాయి. అంతే కాకుండా బోడకాకర రక్తపోటు, గుండె సమస్యలను కూడా దరిచేరనివ్వదు.

బోడ కాకరలో కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకల బలోపేతానికి సహాయపడుతుంది. ఇది వర్షాకాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఇందులోని ఎక్కువ మోతాదులో పొటాషియం ఉన్న కారణంగా రక్తపోటును నియంత్రిస్తుంది. అందుకే బీపీ రోగులకు ఇది మంచి ఆహారం.

బోడకాకరను మీ రోజువారి డైట్‌లో చేర్చుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అధిక మొత్తంలోలభించే ఫైబర్ కారణంగా బోడకాకరను తినడం వల్ల త్వరగా కడుపునిండిన భావన కలుగుతుంది. ఇది మీ ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.




