AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: షుగర్ పేషేంట్స్‌కి పండగలాంటి వార్త…. ఉల్లి చేసే మేలు, తల్లి కూడా చేయలేదనేది ఇందుకే కాబోలు..

Diabetes: ప్రపంచంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతోన్న ఆరోగ్య సమస్యలో డయాబెటిస్‌ ఒకటి. మరీ ముఖ్యంగా భారత్‌లో ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. 2019 లెక్కల ప్రకారం భారత్‌లో 70 మిలియన్లకుపైగా మధుమేహంతో...

Diabetes: షుగర్ పేషేంట్స్‌కి పండగలాంటి వార్త.... ఉల్లి చేసే మేలు, తల్లి కూడా చేయలేదనేది ఇందుకే కాబోలు..
Onion Help For Diabetics
Narender Vaitla
|

Updated on: Sep 13, 2022 | 11:22 AM

Share

Onion Health Benefits: ప్రపంచంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతోన్న ఆరోగ్య సమస్యలో డయాబెటిస్‌ ఒకటి. మరీ ముఖ్యంగా భారత్‌లో ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. 2019 లెక్కల ప్రకారం భారత్‌లో 70 మిలియన్లకుపైగా మధుమేహంతో బాధపడుతున్నారు. 2045 నాటికి ఈ సంఖ్య డబుల్ కానుందని అంచనా వేస్తున్నారు. వీటిలో టైప్‌-2 డయాబెటిస్‌ కేటగిరీనే అధికమని చెబుతున్నారు.

ఇక మధుమేహం వ్యాధిని అడ్డుకట్ట వేయడానికి రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. ఆహార నియమాల్లో మార్పులు చేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఉల్లిపాయ షుగర్‌ వ్యాధికి దివ్యౌషధంగా ఉపయోగపడుతుందనేది సదరు పరిశోధన సారంశం. ముఖ్యంగా ఎర్ర ఉల్లిపాయ అధిక చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్‌ స్థాయిలను కంట్రోల్‌ చేస్తుందని పరిశోధనలో తేలింది. ఉల్లిపాయను పోషకాహార సప్లిమెంట్‌గా కూడా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలను సలాడ్‌ రూపంలో తీసుకుంటే రుచితో పాటు, ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. ఉల్లిపాయ, దోస ముక్కలు, టమాట ముక్కలను కట్ చేసుకొని వాటిపై ఉప్పు, కారం వేసి తీసుకోవచ్చు. అలాగే ఉల్లి రసాన్ని తాగిన ప్రయోజనం ఉంటుంది.

షుగర్‌ లక్షణాలు ఇవే..

ఇక శరీరంలో షుగర్‌ లెవల్స్‌ పెరిగాయన్న విషయాలన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా తరచుగా మూత్ర విసర్జన చేయడం, దాహం వేయడం, ఉన్నపలంగా బరువు తగ్గడం, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు రావడం, గాయాలు త్వరగా మానకపోవడం, విపరీతమైన అలసట, ఆకలి తగ్గడం, చర్మంలో రంగులు మారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం మేరకు అందించినది మాత్రమే. డయాబెటిక్‌ రోగులు వైద్యుల సూచన మేరకే తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. మందులను ఆపేసి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం మంచిది కాదని గుర్తించాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..