AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: శరీరంలో యూరిక్‌ యాసిడ్ పెరిగితే.. నడవడానికి కూడా ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యను ఎలా జయించాలంటే..

Health: శరీరంలో యూరిక్‌ యాసిడ్ పెరగడం వల్ల ఎన్నో రకాల నష్టాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో మారుతోన్న ఆహార విధానం, జీవనశైలి కారణంగా ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. శరీరంలో నుంచి...

Health: శరీరంలో యూరిక్‌ యాసిడ్ పెరిగితే.. నడవడానికి కూడా ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యను ఎలా జయించాలంటే..
Uric Acid
Narender Vaitla
|

Updated on: Sep 13, 2022 | 7:01 AM

Share

Health: శరీరంలో యూరిక్‌ యాసిడ్ పెరగడం వల్ల ఎన్నో రకాల నష్టాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో మారుతోన్న ఆహార విధానం, జీవనశైలి కారణంగా ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. శరీరంలో నుంచి హానికరమైన టాక్సిన్లు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లకపోతే శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల కీళ్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కీళ్లు గౌట్‌ అని పిలిచే క్రస్ట్‌లను ఏర్పరుస్తాయి. ఇది తీవ్రరూపం దాల్చితే కనీసం నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య దరిచేరకూడదంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను కచ్చితంగా డైట్‌లో భాగం చసుకోవాలి. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటంటే..

* శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ను తగ్గించే వాటిలో చెర్రీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

* ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ వ్యవస్థ మెరుగవుతుందని మనందరికీ తెలిసిందే. అయితే ఫైబర్‌ వల్ల యూరిక్‌ యాసిడ్‌ స్థాయి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా తృణధాన్యాలు, బ్రోకలీ, సెలరీ, గుమ్మడికాయ, వోట్స్‌ వంటి వాటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

* ఒత్తిడిని దూరం చేసే డార్క్‌ చాక్లెట్‌ యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను సైతం తగ్గిస్తుంది. ఇందులో ఉండే థియోబ్రోమిన్‌ ఆల్కలాయిడ్‌ యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను తగ్గిస్తుంది. అయితే షుగర్‌ కంటెంట్‌ ఎక్కుగా ఉండని చాక్లెట్‌లను తీసుకోవడం మంచిది.

* టొమాటో కూడా యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్‌ సి యూరిక్‌ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి.

* విటమిన్‌ సి పుష్కలంగా లభించే ఆహార పదార్థాల్లో ఆరెంజ్‌ కూడా ఒకటి. ప్రతీరోజూ ఆరెంజ్‌ తీసుకున్న వారిలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన ఆహార పదార్థాలు శరీరంలో యూరిక్‌ స్థాయి తగ్గించడంలో ఉపయోగపడతాయనేది నిజమే అయినప్పటికీ. ఆరోగ్యం విషయంలో ఎప్పుడైనా వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. కాబట్టి శరీరంలో ఏవైనా మార్పులు కనిపిస్తే సొంత వైద్యాన్ని పక్కనపెట్టి ముందుగా డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..