AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Obesity: పురుషుల కంటే మహిళల్లోనే ఆ సమస్య ఎక్కువ.. తాజా పరిశోధనల్లో సరికొత్త విషయాలు..

పురుషుల కంటే మహిళల్లోనే స్థూల కాయం సమస్య ఎక్కువగా ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ విభాగం తాజాగా విడుదల చేసిన లేక్కల ప్రకారం..

Obesity: పురుషుల కంటే మహిళల్లోనే ఆ సమస్య ఎక్కువ.. తాజా పరిశోధనల్లో సరికొత్త విషయాలు..
Obesity
Sanjay Kasula
|

Updated on: Sep 13, 2022 | 10:05 AM

Share

స్థూల కాయం (Obesity) అంటే శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి నష్టం చేస్తుంది. ఒక వ్యక్తి తన ఎత్తుకు ఎంత బరువు ఉండాలన్నది బాడీ మాస్ ఇండెక్స్ (Body Mass Index) సూచిస్తుంది. ఏ వ్యక్తికైనా ఇది 30 కేజీ/ చదరపు మీటరుకు పైన ఉంటే స్థూలకాయంగా లెక్కిస్తారు. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిస్, నిద్రలో సరిగా ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం అంటే గురక రావడం, కీళ్ళకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం.. సరైన వ్యాయామం లేకపోవడం, కొన్ని సార్లు వారసత్వం కూడా దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

అయితే హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ విభాగం తాజాగా విడుదల చేసిన పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి. వీరు అందించిన వివరాలన ప్రకారం.. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో పురుషుల కంటే మహిళలు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారని తేలింది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-2021) నుంచి సేకరించిన బాడీ మాస్ ఇండెక్స్ (BMI) డేటాను వీరు ఉపయోగించారు. దక్షిణ భారతదేశంలోని 120 జిల్లాల నుంచి 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. తెలంగాణలోని 31 జిల్లాలు, కర్ణాటకలో 30, ఆంధ్రప్రదేశ్‌లో 13, కేరళలో 14, తమిళనాడులో 32 జిల్లాలుల్లో వీరు షాపింల్ సర్వే నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

పురుషుల కంటే మహిళల్లోనే ఈ సమస్య ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. వీరు ముందుగా 15-49 సంవత్సరాల వయస్సు గల పురుషుల కంటే స్త్రీలలోనే అధిక బరువు, ఊబకాయం సమస్య ఎక్కువగా ఉంటుందని నిర్ధారించారు. జాతీయ స్థాయిలో దాదాపు నాల్గవ వంతు స్త్రీలు అధిక బరువు/ఊబకాయం (మహిళలు 24 శాతం), పురుషుల కంటే (22.9 శాతం) కొద్దిగా ఎక్కువగా ఉన్నారని నిర్ధారించుకున్నారు.

మహిళలు స్థూలకాయానికి ఎక్కువ అవకాశం ఉందని ఫరీదాబాద్‌లోని అకార్డ్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్, జనరల్, మినిమల్ యాక్సెస్, మెటబాలిక్ సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆసిఫ్ ఉమర్ న్యూస్ 9 కి  ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. “1997లో స్థూలకాయాన్ని అంటువ్యాధిగా ప్రకటించారు. 2003లో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఇది కేవలం ఒక వ్యాధి కాదని.. ఇది హృదయ సంబంధ వ్యాధులు, వంధ్యత్వం, క్యాన్సర్ వంటి ఇతర వైద్య పరిస్థితులతో సంబంధం ఉన్న సిండ్రోమ్ అని “డాక్టర్ ఉమర్ తెలిపారు.

ఊబకాయం ఎందుకు వస్తుందంటే..

సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్లే ఊబకాయం వస్తుందని గతంలో అనుకునేవారని డాక్టర్ ఉమర్  అభిప్రాయపడ్డారు. ఊబకాయం రావడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయని.. జన్యు, జీవక్రియ, హార్మోన్ల పరిస్థితులు ఊబకాయానికి దారితీస్తాయని డాక్టర్ ఉమర్ హెచ్చరించారు.

స్త్రీలు స్థూలకాయంగా ఉండటానికి కారణం స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత.. గర్భం దాల్చిన తర్వాత, వయసు పెరిగే కొద్దీ బరువు పెరుగడం. వీరిలో మాత్రమే కాకుండా గర్భనిరోధక మందులు తీసుకునే కొందరు మహిళలు కూడా బరువు పెరుగుతారని ఆయన వెల్లడించారు. మహిళలు కూడా థైరాయిడ్ సమస్య కూడా ఇందుకు కారణం కావచ్చని.. ఇవన్నీ మహిళల్లో ఊబకాయం వచ్చేందుకు కారణం కావచ్చని డాక్టర్ ఉమర్ వివరించారు.

అలాగే, వాతావరణ ప్రభావాలు కూడా ఊబకాయానికి కారణం కావచ్చన్నారు. దేశంలోని ఉష్ణమండల వాతావరణం కారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ శ్రమ లేని జీవనశైలిని అలవాటు చేసుకున్నారని.. ఇది కూడా ఒబిసిటీకి కారణం కావచ్చని డాక్టర్ ఉమర్ అభిప్రాయపడ్డారు.

ఊబకాయం అంటే ఏంటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన లెక్కల ప్రకారం, అధిక బరువు, ఊబకాయం ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే అంశాలని తేలింది. 25 కంటే ఎక్కువ ఉన్న బాడీ మాస్ ఇండెక్స్ (BMI)ను అధిక బరువుగా పరిగణించబడుతుంది. అదే 30 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా పిలుస్తారు.

2017 అందించిన లెక్కల ప్రకారం, అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్లకు పైగా బాధితులు మరణిస్తున్నారని తేలింది. ఈ సమస్య అంటువ్యాధి నిష్పత్తి కంటే అధికంగా ఉందని వెల్లడైంది.

జన్యుపరంగా మహిళలు బరువు పెరిగే అవకాశం ఉందా?

ఇదిలావుంటే.. మహిళల్లో హార్మోన్ల మార్పులతో పాటు, జన్యుపరమైన కారణాలు కూడా బరువు పెరిగేందుకు కారణం కావచ్చని డాక్టర్ ఉమర్ తెలిపారు. కుటుంబంలో ఒకరికి స్థూలకాయం ఉంటే.. ఆ ప్రభావం ఆ ఇంట్లోని మరో మహిళపై కూడా ఉంటుందని డాక్టర్ ఉమర్ అన్నారు.

BMI(బాడీ మాస్ ఇండెక్స్) అనేది వ్యక్తి ఎత్తు, బరువును ఉపయోగించి తెలుసుకోవడానికి ఉపయోగించే కొలత. ఈ లేక్క ప్రకారం.. పెద్దవారి బరువును కిలోలు, వారి ఎత్తుతో స్క్వేర్డ్ మీటర్లలో భాగిస్తారు. ఉదాహరణకు.. BMI 35 అంటే 35kg/m2 అని అర్థం.

BMI 35 ఉంటే.. ఈ సంఖ్య 18-23 ఆరోగ్యంగా ఉన్నాడని; ఇది 23-25 ​​మధ్య ఉంటే..  ఆ వ్యక్తి అధిక బరువుతో ఉన్నాడని,  30 కంటే ఎక్కువ వయసు కలిగిన వ్యక్తిలో ఉంటే ఊబకాయంతో బాధపడుతున్నాడని అర్థం. BMI కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తి గ్రేడ్ 3 ఊబకాయం అని లేదా  అధిక ఊబకాయం అని పిలుస్తారు.

 అధిక ఊబకాయం ఉన్న మహిళలు బేరియాట్రిక్ సర్జరీని ఎంచుకోవాలా?

మహిళల్లో BMI 30 కంటే తక్కువగా ఉన్నట్లయితే.. వారు తప్పనిసరిగా డైటింగ్ చేయడం తప్పనిసరి.. అంతే కాదు వారు తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలని అనుకుంటే వారానికి ఐదు రోజులు 40 నిమిషాలు వాకింగ్ చేయాలి. ఆ వ్యక్తి తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ప్రోటీన్లు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

కానీ BMI 30 కంటే ఎక్కువ ఉన్నప్పుడు వారికి మధుమేహం, రక్తపోటు వంటి కొమొర్బిడిటీలు కూడా ఉండే అవకాశం ఉదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటివారు వెంటనే నిపుణుడిని సంప్రదించాల్సిన అవసం ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్లు సూచిస్తే శస్త్రచికిత్సను ఎంచుకోవచ్చని డాక్టర్ ఉమర్ తెలిపారు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..