ABHA CARD: ఆరోగ్యానికి అభయం..కేంద్ర ప్రభుత్వం అందించే ఈ హెల్త్ కార్డు మీకు తెలుసా?
ప్రతి సారి మనం మన హెల్త్ రిపోర్ట్స్ ను క్యారీ చేయలేకపోవచ్చు. అలాగే అత్యవసర సమయాల్లో హెల్త్ రికార్డ్స్ ఎలా? ఈ విషయంలో మనలో చాలా మంది ఇబ్బంది పడి ఉంటారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదే అభ కార్డు (ABHA CARD) ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్.
మనం ఎప్పుడైనా అనారోగ్యానికి గురైనప్పడు ఆస్పత్రికి వెళ్తే అక్కడి వైద్యులు మీ పాత హెల్త్ రిపోర్ట్స్ అడగడం సహజం. కానీ ప్రతి సారి మన హెల్త్ రిపోర్ట్స్ ను క్యారీ చేయలేకపోవచ్చు. అలాగే అత్యవసర సమయాల్లో హెల్త్ రికార్డ్స్ ఎలా? ఈ విషయంలో మనలో చాలా మంది ఇబ్బంది పడి ఉంటారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదే అభ కార్డు (ABHA CARD) ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్. అభ కార్డును ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ హెల్త్ అథారిటీ ప్రవేశపెట్టింది. ఆయుష్మాన్ హెల్త్ ఐడీ లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ గా ఇది ప్రసిద్ధి చెందింది. దీన్ని పొందడం ద్వారా రూ.5 లక్షల ఆరోగ్య బీమాను పొందవచ్చు.
ABHA అంటే ఏమిటి?
ABHA కార్డు ఆధార్ కార్డు లేదా మొబైల్ నెంబర్ ను ఉపయోగించే రూపొందిచబడే 14 అంకెల ఓ ప్రత్యేకమైన ఆరోగ్య ఐడీ. ఈ ఐడీని వినియోగదారులు తమ ఆరోగ్య రికార్డులను బీమా ప్రోవైడర్లు, ఆస్పత్రులు, క్లినిక్ లకు డిజిటల్ గా షేర్ చేసుకోవచ్చు. ABHA కార్డు మనల్ని డాక్యుమెంటేషన్, మెడికల్ రిపోర్టుల సంరక్షణ నుంచి కాపాడుతుంది. ఈ 14 అంకెల సంఖ్య మీరు ఎక్క ఉన్నా మీ మెడికల్ రికార్డులకు యాక్సెస్ ను అందిస్తుంది. తద్వారా మన హెల్త్ కండిషన్ తెలుసుకోడానికి వైద్యులకు ఉపయోగపడుతుంది.
ABHA కార్డును అప్లయ్ చేయడం ఎలా?
ABHA కార్డును ఆన్ లైన్ లో పూర్తి ఉచితంగా పొందవచ్చు. ABHA కార్డును పొందడానికి ఈ స్టెప్స్ ను ఫాలో అయితే చాలు
Step-1
ABHA కార్డు మొదటిగా వెబ్ సైట్ కు వెళ్లాలి
Step-2
వెబ్ సైట్ లో క్రియెట్ అభ నెంబర్ పై క్లిక్ చేయాలి
Step-3
మన ముందు డిస్ ప్లే అయిన ఆప్షన్స్ లో యూజింగ్ ఆధార్ పై క్లిక్ చేయాలి.
Step-4
తర్వాత ఆధార్ ను ఎంటర్ చేసి ‘నేను అంగీకరిస్తున్నాను’ అనే ట్యాబ్ పై క్లిక్ చేసి మన దరఖాస్తును సమర్పించాలి.
Step-5
అనంతరం మన ఫోన్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి, సబ్మిట్ చేస్తే ఇంకో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step-6
ఆ పేజీలో డిస్ ప్లే అయిన వివరాలు సరిచేసుకుని సబ్మిట్ చేస్తే ఇంకో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది
Step-7
ఈ పేజీలో మన ఈ మెయిల్ చిరునామాకు సమానమైన సరికొత్త హెల్త్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మనం మన ఫొటోతో ఉన్న ABHA కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఇలా సింపుల్ స్టెప్స్ తో మీరు మీ ABHA కార్డును పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..