ఈ మూడు జ్యూస్‌లు తాగితే చాలు.. చెడు కొవ్వును పిప్పి చేస్తాయంతే.. అవేంటో తెలుసా..?

భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు ఈ సమస్య 40 ఏళ్ల తర్వాత ఎక్కువగా ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో, పిల్లలు, చిన్న వయస్సు గల వారు కూడా బాధితులుగా మారుతున్నారు.

ఈ మూడు జ్యూస్‌లు తాగితే చాలు.. చెడు కొవ్వును పిప్పి చేస్తాయంతే.. అవేంటో తెలుసా..?
Weight Loss
Follow us

|

Updated on: Jul 30, 2024 | 8:33 PM

భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు ఈ సమస్య 40 ఏళ్ల తర్వాత ఎక్కువగా ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో, పిల్లలు, చిన్న వయస్సు గల వారు కూడా బాధితులుగా మారుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో అందరూ కొలెస్ట్రాల్ గురించి అప్రమత్తంగా ఉండాలి.. లేకపోతే అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, గుండె వైఫల్యం, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటి వ్యాధులు సంభవించవచ్చు. అయితే.. చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు 3 రకాల జ్యూస్‌లను తీసుకుంటే చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.. వీటిని క్రమంగా తీసుకుంటే.. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇవి చాలా సహాయపడతాయని పేర్కొంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ 3 జ్యూస్‌లు తాగండి

సొరకాయ రసం..

సొరకాయ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన కూరగాయ.. దీనిని భారతదేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో కూరగా ఉపయోగిస్తారు. చాలా మందికి ఈ కూరగాయ అంటే చాలా ఇష్టం.. వీటితో సాంబారు చేసి తినడానికి ఇష్టపడతారు. సొరకాయలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.. కాబట్టి ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు సొరకాయ రసం త్రాగాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

బీట్‌రూట్ జ్యూస్..

బీట్‌రూట్ చాలా ఆరోగ్యకరమైన ఆహారపదార్థం.. ఇది భూగర్భంలో పండుతుంది… ప్రజలు సాధారణంగా దీనిని సలాడ్‌గా తినడానికి ఇష్టపడతారు. అయితే మీరు దాని రసాన్ని రోజూ తాగితే, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది చాలా వరకు సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.

కాకరకాయ జ్యూస్..

కాకరకాయ రుచి చాలా చేదుగా ఉంటుంది.. అందుకే చాలా తక్కువ మంది దీనిని తినడానికి ఇష్టపడతారు. కానీ ఈ కూరగాయలలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. మీరు ప్రతిరోజూ కనీసం ఒక గ్లాసు కాకరకాయ రసాన్ని తాగితే.. కొన్ని రోజుల్లోనే తేడాను గమనించవచ్చు..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..