Joint Pains: శీతాకాలంలో కీళ్ల నొప్పులు పెరగకుండా ఉండాలంటే.. ఇంట్లోనే ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి

చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు మందులకు బదులు ఇంట్లో చిన్న పాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Joint Pains: శీతాకాలంలో కీళ్ల నొప్పులు పెరగకుండా ఉండాలంటే.. ఇంట్లోనే ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
Joint Pains In Weather
Follow us

|

Updated on: Oct 29, 2024 | 1:41 PM

మారుతున్న వాతావరణం కారణంగా పలు రకాల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వాటిలో కీళ్ల నొప్పుల సమస్య ఒకటి. గతంలో ఈ సమస్య వృద్ధులను మాత్రమే ఇబ్బంది పెట్టేది. కానీ నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు దీని బారీన పడుతున్నారు. నానాటికీ దిగజారుతున్న జీవనశైలి కారణంగా యువతలో ఈ సమస్య కనిపిస్తుంది. వాతావరణం చల్లగా మారడంతో ఈ సమస్య మరింత పెరుగుతుంది. అయితే దీని కోసం మందులు వేసుకునే బదులు ఇంటి నివారణ చిట్కాలు తీసుకోవడం మంచిది.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వాతావరణం మారడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రతంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కీళ్ల నొప్పులతో బాధపడేవారి సమస్యలు మరింత పెరుగుతుంది. కీళ్లనొప్పుల సమస్య అన్నికాలాల్లో కొనసాగుతూనే ఉన్నప్పటికీ, చలికాలంలో నొప్పి తీవ్రంగా వస్తుంది. దీని కారణంగా రోజువారీ పనులు చేసుకోవడం కష్టం అవుతుంది. చలి కారణంగా కీళ్లలో విపరీతమైన నొప్పులు రావడం, వేళ్లు, కాలి వేళ్లలో వాపు రావడం వల్ల దేనినైనా పట్టుకోవడం కూడా కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో, వైద్యులు రాసిచ్చే మందులు తీసుకోవడం కంటే ఇంటి నివారణ చికిత్సలు తీసుకోవడం ఉత్తమంగా ఉంటాయి.

వ్యాయామం

శీతాకాలంలో కీళ్ల నొప్పి బాగా పెరిగినప్పటికీ, అసౌకర్యంగా ఉన్నప్పటికీ తేలికపాటి కదలికలతో వ్యాయామం చేస్తే, ఉపశమనం లభిస్తుంది. ఇది రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. రక్తం వేడెక్కినప్పుడు, చేతులు, కాళ్ళలో వాపు తగ్గడం ప్రారంభమవుతుంది. కాబట్టి వైద్యుల సలహా మేరకు మీ సౌకర్యాన్ని బట్టి వ్యాయామం చేయాలి.

ఇవి కూడా చదవండి

స్ట్రెచింగ్

మీకు వ్యాయామం చేయడానికి సమయం లేకపోతే, రోజూ స్ట్రెచింగ్ కూడా చేయవచ్చు. దీనితో చేతులు, కాళ్ళలో కదలిక ఏర్పడి నొప్పి నుంచి వేగంగా ఉపశమనం కలిగిస్తుంది. మీరు కూర్చున్నప్పుడు కూడా స్ట్రెచింగ్ చేయవచ్చు.

శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి

చలి కారణంగా ఈ నొప్పి చాలా పెరుగుతుంది. అందుకే ఎల్లప్పుడూ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి వెచ్చని దుస్తులను ఉపయోగించాలి. చేతులు, కాలి వేళ్లకు సాక్స్. గ్లోవ్స్‌ వినియోగించాలి.

వేడి నీరు తాగాలి

నొప్పి ఉన్న ప్రదేశాన్ని వేడి నీటితో కాపడం పెట్టుకోవాలి. ఆలాగే వేడి నీరు తాగడం వల్ల కూడా చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఆవాల నూనె కొన్ని చుక్కలు కలిపి, అందులో పాదాలు, చేతులు ముంచి కాసేపటి వరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడిచి, సాక్స్ లేదా చేతికి గ్లౌవ్స్‌ ధరించాలి. ఇలా చేయడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. దీని తర్వాత చలిలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. రాత్రి పడుకునే ముందు ఫోమెంటేషన్ చేయడానికి ప్రయత్నించాలి. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

గోరువెచ్చని నూనెతో మసాజ్

నొప్పి ఉన్న ప్రాంతాన్ని గోరువెచ్చని నూనెతో తేలికగా మసాజ్ చేయవచ్చు. ఇది కూడా చాలా ఉపశమనం కలిగిస్తుంది. మసాజ్ చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని వెచ్చని గుడ్డతో కప్పి, గాలి తగలకుండా ఉంచాలి.

సమయానికి మందులు తీసుకోవాలి

కీళ్ల నొప్పులకు మీరు ఏదైనా ఔషధం తీసుకుంటుంటే.. ఖచ్చితంగా సమయానికి మందులు తీసుకోవాలి. శీతాకాలంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే అనవసరంగా బయటకు వెళ్లకపోవడం మంచిది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.