అందుకే.. రోజుకొక్క గ్నీన్‌ ఆపిల్‌ తినాలట!

29 October 2024

TV9 Telugu

TV9 Telugu

రోజూ ఒక యాపిల్‌ తింటే డాక్టర్‌తో పని ఉండదని చిన్నప్పటి నుంచి వైద్యులు చెబుతూనే ఉన్నారు. అసలింతకీ ఇందులో ఉన్న సుగుణాలేంటో, ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా..

TV9 Telugu

కెలోరీలు, పీచు, సి-విటమిన్, కాపర్, పొటాషియం.. వంటి పోషకాలు యాపిల్‌లో అధికం. మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఇది రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

TV9 Telugu

ముఖ్చంగా ఆకుపచ్చ ఆపిల్ పండు రోజుకొక్కటి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి.. గ్రీన్ యాపిల్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయట. ఇది అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది

TV9 Telugu

గ్రీన్ యాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా గ్రీన్ యాపిల్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది

TV9 Telugu

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తినవచ్చు. మీరు రోజూ ఒక గ్రీన్ యాపిల్ తింటే, అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో కడుపు మరింత శుభ్రంగా ఉంటుంది

TV9 Telugu

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో గ్రీన్ యాపిల్ తీసుకుంటే, మీకు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. గ్రీన్ యాపిల్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది

TV9 Telugu

వీటిని ఖాళీ కడుపుతో తింటే, జీర్ణక్రియ సక్రమంగా మారుతుంది. బరువు తగ్గడంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. డైజెషన్‌ని పెంచి గట్‌హెల్త్‌ని పెంచుతుంది

TV9 Telugu

గ్రీన్ యాపిల్స్‌లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది హెల్దీ బ్యాక్టీరియాని పోషిస్తుంది. దీంతో మలబద్ధకం, డయేరియా వంటి సమస్యల్ని తగ్గించవచ్చు. వీటిల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్‌ కూడా ఉంటాయి