AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 ఏళ్ల నరకం.. ఒక్క చిన్న మార్పుతో ఎలా నయం అయ్యిందో తెలుసా..?

గట్ హెల్త్ మన శరీర ఆరోగ్యానికి కీలకం. కడుపు ఉబ్బరం, నీరసం, జీర్ణ సమస్యలు ఏళ్ల తరబడి బాధపెడుతుంటే జీవితం ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమస్యలను పదేళ్ల పాటు ఎదుర్కొన్న ఒక మహిళ చివరికి ఒక చిన్న చిట్కాతో ఉపశమనం పొందింది. ఆమె అనుభవం ఇప్పుడు చాలా మందికి మార్గదర్శకంగా మారుతోంది.

10 ఏళ్ల నరకం.. ఒక్క చిన్న మార్పుతో ఎలా నయం అయ్యిందో తెలుసా..?
Gut Health
Prashanthi V
|

Updated on: Aug 21, 2025 | 2:50 PM

Share

పదేళ్లుగా కడుపు ఉబ్బరం, నీరసం, ఎన్నో రకాల చికిత్సలతో విసిగిపోయిన కెల్సీ అనే మహిళ చివరికి ఒక చిన్న చిట్కాతో తన సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టింది. మన శరీరంలో రోగనిరోధక శక్తి నుంచి హార్మోన్ల సమతుల్యత వరకు గట్ హెల్త్ చాలా విషయాలపై ప్రభావం చూపుతుంది. అది సరిగా లేకపోతే మాత్రం సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులను ఒక దశాబ్దం పాటు ఎదుర్కొన్న కెల్సీ కండిఫ్ తనకు దొరికిన సులభమైన పరిష్కారాన్ని అందరితో పంచుకుంది.

గట్ సమస్యలకు అసలు కారణం ఏంటి..?

కెల్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఇలా రాసింది.. నా గట్ హెల్త్ ఇంత త్వరగా మెరుగవ్వడం చూసి నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఇది గట్ హెల్త్‌ కు సంబంధించి అత్యంత రహస్యమైన చిట్కా అని నాకు అనిపిస్తోంది.

ఆమె ఇంకా చెబుతూ.. గట్‌ను బాగు చేయాలంటే ముందుగా లీకీ గట్ సమస్యను పరిష్కరించాలి. ఈ రోజుల్లో చాలా మందికి ఇది పెద్ద సమస్యగా మారింది. దీనికి కారణాలు.. సీడ్ ఆయిల్స్, రసాయనాలు, మందులు, ఒత్తిడి, వాతావరణ కాలుష్యం. మీకు గట్ సమస్యలు ఉంటే.. వీటిలో ఏది మీకు ప్రధాన కారణమో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

కెల్సీ చెప్పిన దాని ప్రకారం.. లీకీ గట్ వల్ల వచ్చే ఇష్యూస్

  • కొన్ని రకాల ఆహారాలు పడకపోవడం
  • అలర్జీలు
  • హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం
  • శరీరంలో మంట (ఇన్‌ఫ్లమేషన్)
  • మూడ్ స్వింగ్స్
  • షుగర్ లెవెల్స్ పెరగడం

లీకీ గట్‌ను ఎలా నయం చేయాలి..?

కెల్సీ తనకు బాగా పని చేసిన కొన్ని చిట్కాలను పంచుకుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఆహారం సులభంగా కదలడానికి.. నాకు ఇనులిన్ ఫైబర్ చాలా నచ్చింది. నేను రోజూ ఒక చెంచా తీసుకుంటాను. ఇది నా జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కడుపులో మంచి బ్యాక్టీరియాను కూడా పెంచుతుంది అని కెల్సీ వివరించింది.
  • గట్ లైనింగ్‌ను రిపేర్ చేయడం.. జీర్ణకోశం లోపలి పొరను బలోపేతం చేయడం చాలా అవసరం. ఇందుకోసం మార్ష్‌మాలో రూట్, లైకరైస్ రూట్, స్లిప్పరీ ఎల్మ్ వంటి హెర్బ్స్ చాలా ఉపయోగపడతాయి. అలాగే మంచి నాణ్యత గల కొలాజెన్ సప్లిమెంట్ తీసుకోవాలి. ఇది గట్ లైనింగ్‌ను రిపేర్ చేయడానికి అవసరమైన పదార్థాలను అందిస్తుంది అని ఆమె చెప్పింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.