AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విటమిన్ B12 బెనిఫిట్స్.. బ్రెయిన్ నుంచి బోన్స్ వరకు ఎందుకంత ముఖ్యమంటే..?

విటమిన్ B12 శరీరానికి, మనసుకు శక్తినిచ్చే కీలక పోషక పదార్థం. ఇది మెదడు, గుండె, ఎముకలు, కళ్ళు, చర్మం, జుట్టు వంటి అనేక అవయవాల ఆరోగ్యానికి అవసరం. బి12 లోపం అలసట, మూడ్ స్వింగ్స్, బలహీనతకు కారణమవుతుంది. ఈ విటమిన్‌ వల్ల కలిగే 10 ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ B12 బెనిఫిట్స్.. బ్రెయిన్ నుంచి బోన్స్ వరకు ఎందుకంత ముఖ్యమంటే..?
Vitamin B12 Deficiency
Prashanthi V
|

Updated on: Aug 10, 2025 | 6:12 PM

Share

నేటి బిజీ లైఫ్‌లో ఫిజికల్ హెల్త్‌ తో పాటు మెంటల్ పీస్ కూడా చాలా ముఖ్యం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో విటమిన్ B12 చాలా హెల్ప్ చేస్తుంది. ఈ విటమిన్ మన బాడీలో స్టోర్ అవ్వదు.. అందుకే దీన్ని డైలీ ఫుడ్‌లో తీసుకోవడం చాలా అవసరం. అలసటను తగ్గించడంలో, బ్రెయిన్ ఫంక్షన్‌ను మెరుగుపరచడంలో, మూడ్‌ను సరిచేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇండియాలో దాదాపు 70 శాతం మందిలో దీని కొరత ఉందని NCBI సర్వే తెలిపింది. విటమిన్ B12 వల్ల కలిగే 10 ముఖ్యమైన బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెయిన్ హెల్త్‌కు బెస్ట్ ఫ్రెండ్

విటమిన్ B12 మెదడులో నర్వస్ సిస్టమ్ ఫంక్షన్‌ను మెరుగుపరచడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. దీని వల్ల చిరాకు, స్ట్రెస్, డిప్రెషన్ లాంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మెమరీ పవర్ పెరుగుతుంది. మెంటల్ స్టెబిలిటీ మెరుగవుతుంది.

హార్ట్‌కు ప్రొటెక్షన్

ఇది హోమోసిస్టీన్ అనే డేంజరస్ మెటీరియల్ లెవెల్‌ను తగ్గిస్తుంది. ఇది హార్ట్ డిసీజెస్‌కు దారితీసే ముఖ్య కారణాల్లో ఒకటి. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇది హెల్ప్ చేస్తుంది.

బోన్స్ బలంగా ఉండాలంటే..

ఎముకల బలాన్ని నిలబెట్టుకోవడానికి విటమిన్ B12 అవసరం. ఇది ఆస్టియోపోరోసిస్ వంటి రోగాల నుంచి కాపాడుతుంది. బోన్స్ స్ట్రాంగ్‌ గా, హెల్దీగా ఉండాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియెంట్.

బేబీ డెవలప్‌మెంట్‌కు

ప్రెగ్నెన్సీ టైమ్‌లో బేబీ బ్రెయిన్, నర్వ్స్ డెవలప్‌మెంట్‌కు B12 చాలా అవసరం. ప్రెగ్నెంట్ లేడీ తీసుకునే B12 వల్ల బేబీలో బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి.

అలసట, నీరసం తగ్గాలంటే

ఏ పనీ చేయకపోయినా శక్తిలేకపోవడం, అలసటగా ఉండటం అనిపిస్తే అది B12 లోపానికి ఒక సైన్ కావచ్చు. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ పెంచి ఎనర్జీని ఇస్తుంది.

ఐ హెల్త్‌ కోసం కూడా..

ఏజ్ పెరిగే కొద్దీ ఐ సైట్ వీక్ అవుతుంది. కానీ B12 కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.

మెటబాలిజం ఇంప్రూవ్

ఈ విటమిన్ బాడీలోని మెటబాలిజాన్ని స్పీడ్ చేస్తుంది. ఫలితంగా డైజెషన్ బాగా జరుగుతుంది, వెయిట్ కంట్రోల్‌లో ఉంటుంది.

యాక్టివ్‌గా ఉండాలంటే..

B12 బాడీకి డైలీ అవసరమయ్యే ఎనర్జీని ఇస్తుంది. దీని వల్ల అలసట రాకుండా రోజంతా ఉత్సాహంగా వర్క్ చేయగలుగుతారు.

స్కిన్, హెయిర్, నెయిల్స్ హెల్త్‌

స్కిన్ డల్‌గా కనిపించడం, హెయిర్ వీక్ అవ్వడం లేదా రాలిపోవడం, నెయిల్స్ నల్లగా మారడం వంటి వాటికి B12 లోపమే ఒక రీజన్ కావచ్చు. ఇది న్యూ సెల్స్ ప్రొడక్షన్‌ను ప్రమోట్ చేస్తుంది.

కాన్ఫిడెన్స్ పెంచడానికి

విటమిన్ B12 శరీరంలో శక్తి, ఉత్సాహాన్ని పెంచుతుంది. దాని వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా మానసికంగా మనం మరింత దృఢంగా ఉండేందుకు కూడా ఇది సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)