వేసవిలో నీరు తాగుతున్నా నీరసంగా అనిపిస్తుందా..? మీ శరీరం ఇచ్చే ఈ సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
మీరు రోజంతా తగినంత నీరు తాగుతున్నారా? అయినా సరే నీరసంగా, తలనొప్పిగా అనిపిస్తోందా? అయితే మీ శరీరం మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది.. ఎండలో తిరిగినా లేదా శారీరక శ్రమ ఎక్కువైనా కేవలం నీరు తాగితే సరిపోదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరానికి నీటితో పాటు అత్యంత కీలకమైన ఎలక్ట్రోలైట్స్ కూడా అవసరం. అసలు నీరు తాగినా నీరసం ఎందుకు వస్తుంది? అనే విషయాలు తెలుసుకుందాం..
మీ శరీరం మీకు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తోందా? శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉన్నరోజులలో మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి కేవలం నీరు మాత్రమే సరిపోతుందా అంటే కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎప్పుడూ దాహంగా ఉండడం, నోరు ఎండిపోవడం, అలసట, తలనొప్పి, డార్క్ యెల్లో యూరిన్, డ్రై స్కిన్, ఎనర్జీ లేనట్టు అనిపించడం వంటివన్నీ డీహైడ్రేషన్ లక్షణాలు కావచ్చు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీకు చెమట పట్టినప్పుడు, మీరు కేవలం నీటిని మాత్రమే కోల్పోరు. ఎనర్జీ బ్యాలెన్స్, నార్మల్ బాడీ ఫంక్షన్‌ని కాపాడుకోవడానికి సహాయపడే ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లను కూడా కోల్పోతారు. వేసవిలో, ఎక్కువ గంటలు ఆరుబయట గడపడం, తీరికలేని పనులు, ప్రయాణాలు, వ్యాయామాలు, వేడిలో ఎక్కువ ఉండడం వంటివి క్రమంగా శరీరాన్ని నీరసపరిచి, అలసిపోయేలా చేస్తాయి.
వేడికి గురైనప్పుడు, ప్రయాణాలలో, ఎక్కువ గంటలు పనిచేసినప్పుడు, శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉన్నరోజులలో బ్యాలెన్స్ చేయడానికి కేవలం నీరు మాత్రమే సరిపోదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు . ఎలక్ట్రోలైట్‌లను తగినంత అందించడం ముఖ్యం. ఈ నార్మల్ విషయాలను మరిచిపోవడం వల్ల అలసిపోయి, నీరసించిపోయి, రోజంతా మీరు మెరుగైన పనితీరును అందించలేక పోవచ్చు. నీరసం వచ్చే వరకు వేచి ఉండకండి. ఈ వేసవిలో లక్షణాలు గమనించండి. డీహైడ్రేషన్ పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ శరీరంలోని ఫ్ల్యూయిడ్స్ ని సరి చూసుకోండి , ఎలక్ట్రోలైట్లను తీసుకుని హీట్ తట్టుకుని నిలబడండి.
