AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్: రూ. 55 లక్షల వరకు రుణం.. మీకు నచ్చిన ఈఎంఐ ఆప్షన్లతో!

జీవితంలో అనుకోని ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఎదురవుతాయో చెప్పలేం. ఆకస్మిక వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మతులు లేదా పెళ్లి వంటి శుభకార్యాల సమయంలో చేతిలో డబ్బు లేకపోవడం ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటి సమయాల్లో ఎటువంటి ఆస్తి తాకట్టు లేకుండా ఆర్థిక అండగా నిలిచేవి 'పర్సనల్ లోన్స్'. అయితే, కేవలం రుణం తీసుకోవడం మాత్రమే కాదు, దానిపై ఉండే వడ్డీ రేటు మీ నెలవారీ బడ్జెట్‌ను ఎలా మారుస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి తక్కువ వడ్డిరేటుకు లోన్ ఎలా పొందాలో చూద్దాం.

బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్: రూ. 55 లక్షల వరకు రుణం.. మీకు నచ్చిన ఈఎంఐ ఆప్షన్లతో!
Personal Loan Interest Rates
Anand T
|

Updated on: Apr 24, 2026 | 5:29 PM

Share

చాలామంది లోన్ తీసుకునేటప్పుడు కేవలం వడ్డీ రేటును మాత్రమే చూస్తారు. కానీ, రేటులో 1% లేదా 2% మార్పు వచ్చినా, అది మొత్తం తిరిగిచెల్లింపుపై వేల రూపాయల ప్రభావాన్ని చూపుతుంది. రేటులో చిన్నపాటి వ్యత్యాసము కూడా వేలకొద్దీ రూపాయల అదనపు తిరిగిచెల్లింపుగా మారవచ్చు. అందుకే మీరు దరఖాస్తు చేసే ముందు మీ రేట్ ఎలా మీ ఈఎంఐని, మొత్తమ్మీది వ్యయాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది అర్థంచేసుకోవడం ముఖ్యం. అయితే బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ వార్షికంగా 10 శాతం నుండి 30 శాతం వరకు ఉండే వడ్డీ రేట్లతో రూ. 55 లక్షల వరకు లోన్ ఇస్తుంది. అది కూడా మీ లోన్ మొత్తాన్ని జస్ట్ 24 గంటలలోపు మీ అకౌంట్లో జమ చేస్తుంది. దీనితో ఇది పణాళిక చేయబడిన, అత్యవసర ఖర్చులకు రెండిటికి ఒక అనుకూలమైన ఎంపిక అవుతుంది.

పర్సనల్ లోన్ ఈఎంఐ అంటే ఏమిటి, దానిని ఎలా లెక్కిస్తారు?

ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. దీన్ని మీరు తీసుకున్న మొత్తం లోన్ పూర్తయ్యేంత వరకు ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా మీ ఈఎంఐ 3 ముఖ్యమైన కారకాలచే నిర్ణయించబడుతుంది, ఋణ మొత్తము, పర్సనల్ లోన్ వడ్డీ రేటు, తిరిగిచెల్లింపు కాలపరిమితి. లోన్ ఇచ్చిన వాళ్లు ప్రతి నెల మీ కట్టాల్సిన అమౌంట్‌పై వడ్డీని లెక్కిస్తారు. మూలధనములో కొంత భాగాన్ని చేరుస్తారు, మీరు ఎంచుకున్న కాలవ్యవధిలో సమానంగా విభజిస్తారు. మీరు ఎలాంటి లెక్కంపు అవసరం లేకుండానే ఈ మూడు విలువలను ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ లో వేసి నెలవారి వాయిదాలను తక్షణమే తెలుసుకోవచ్చు.

EMIని ప్రభావితం చేసే అంశాలివే

  • అధిక వడ్డీ రేటు: ఈఎంఐ, మొత్తం తిరిగిచెల్లింపును పెంచుతుంది
  • సుదీర్ఘ కాలవ్యవధి: ఈఎంఐని తగ్గిస్తుంది కాని చెల్లించబడే మొత్తం వడ్డీని పెంచుతుంది
  • అధిక ఋణ మొత్తము: నిష్పత్తిలో ఈఎంఐని పెంచుతుంది

పర్సనల్ లోన్ వడ్డీ రేటు మీ మొత్తం తిరిగిచెల్లింపును ఎలా ప్రభావితం చేస్తుంది

ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. 5 లక్షల రుణాన్ని 5 ఏళ్ల కాలపరిమితికి తీసుకున్నారనుకుందాం.

10% వడ్డీ రేటు వద్ద: నెలవారీ ఈఎంఐ రూ. 10,624 అవుతుంది. మొత్తం తిరిగిచెల్లించే మొత్తం రూ. 6,37,411. 18% వడ్డీ రేటు వద్ద: నెలవారీ ఈఎంఐ రూ. 12,697 అవుతుంది. మొత్తం తిరిగిచెల్లించే మొత్తం రూ. 7,61,803.

కేవలం వడ్డీ రేటు పెరగడం వల్ల రుణగ్రహీత రూ. 1.24 లక్షలకు పైగా అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అందుకే తక్కువ వడ్డీ రేటు పొందేందుకు 650 కంటే ఎక్కువ సిబిల్ (CIBIL) స్కోర్ కలిగి ఉండటం ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు.

బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఎందుకు ఎంచుకోవాలి

ఖర్చులకు అనుగుణంగా ప్రణాళిక చేసుకునే వారి కోసం బజాజ్ ఫిన్సర్వ్ అనేక రకాల రుణ వెసులుబాట్లను అందిస్తోంది.

  • భారీ రుణ మొత్తం: రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు రుణం పొందే అవకాశం.
  • సత్వర పంపిణీ: దరఖాస్తు ఆమోదం పొందిన 24 గంటలలోపు నగదు ఖాతాలోకి జమ.
  • ఫ్లెక్సిబుల్ కాలపరిమితి: 12 నెలల నుండి 108 నెలల వరకు తిరిగి చెల్లించే వెసులుబాటు.
  • పూచీకత్తు అవసరం లేదు: ఎటువంటి ఆస్తులు హామీగా పెట్టాల్సిన పని లేదు.

బజాజ్ ఫైనాన్స్ మూడు పర్సనల్ లోన్ రకాలను కూడా అందిస్తుంది.

టర్మ్ లోన్: ఈ లోన్ మొత్తాన్ని ఒకే సారి అందిస్తారు. ప్రతి నెలా సమాన వాయుదాలతో తిరిగి చెల్లించాలి ఫ్లెక్సి టర్మ్ (డ్రాప్‎లైన్) లోన్: ముందుగా-ఆమోదించబడిన పరిమితి నుండి విత్‎డ్రా చేసుకోండి. మీరు ఉపయోగించుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లించండి. ఫ్లెక్సి హైబ్రిడ్ టర్మ్ లోన్: మొదట్లో వడ్డీ-మాత్రమే ఈఎంఐలు, ఆ తరువాత క్రమబద్ధీకరించబడిన ఈఎంఐలు

ఫ్లెక్సి హైబ్రిడ్ లోన్: కొత్త తరం రుణ ఎంపిక

బజాజ్ ఫైనాన్స్ ప్రత్యేకంగా ‘ఫ్లెక్సి హైబ్రిడ్ టర్మ్ లోన్’ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రుణగ్రహీతలు తమకు కేటాయించిన పరిమితి నుండి అవసరమైనప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ముఖ్యంగా, ప్రారంభ కాలపరిమితిలో (36 నెలల వరకు) కేవలం వడ్డీని మాత్రమే ఈఎంఐగా చెల్లించే సౌకర్యం ఉంటుంది. ఇది నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది

ఎలా ధరఖాస్తు చేసుకోవాలి

  • ఆసక్తి గల వారు బజాజ్ ఫిన్సర్వ్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించి, ఫోన్ నంబర్, ప్రాథమిక వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ వెబ్ పేజ్ కు వెళ్ళండి. పేజ్ పై భాగాన ఉన్న “దరఖాస్తు చేయండి” పై క్లిక్ చేయండి
  • మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి, తర్వాత మీకు వచ్చిన ఓటిపితో లాగిన్ అవ్వండి
  • మీ ప్రాథమిక లోన్ వివరాలతో దరఖాస్తు పత్రాన్ని పూరించండి
  • లోన్ ఎంపిక పేజ్‌కు వెళ్లేందుకు “కంటిన్యూ” పై క్లిక్ చేయండి
  • మీకు అవసరమైన లోన్ మొత్తాన్ని ఎంటర్ చేసి మీ కావాలసిన లోన్ రకాన్ని ఎంచుకోండి
  • 12 నెలలు, 108 నెలల మధ్య ఉండే తిరిగిచెల్లింపు కాలవ్యవధిని ఎంచుకుని “కంటిన్యూ” పై క్లిక్ చేయండి
  • మీ కేవైసి పూర్తి చేసి, మీ దరఖాస్తును సబ్మిటి చేయండి
  • అంతే కేవైసీ (KYC) ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు.

లోన్ తీసుకునేముందు తెలివిగా ప్రణాళిక చేసుకోండి

రుణం తీసుకునే ముందు ‘ఈఎంఐ కాలిక్యులేటర్’ వాడటం వల్ల వివిధ వడ్డీ రేట్లు, కాలపరిమితులను పోల్చి చూసుకోవచ్చు. సరైన ప్రణాళికతో తీసుకునే రుణం ఆర్థిక భారం కాకుండా, ఆపత్కాలంలో గొప్ప ఆసరాగా నిలుస్తుంది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.