నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు థ్యాంక్స్.. ఆ హీరోకు భాగ్యశ్రీ విషెస్..

Rajitha Chanti

Pic credit - Instagram

16 May 2026

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే కథానాయికగా రాణిస్తుంది హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయినప్పటికీ క్రేజ్ ఎక్కువగానే ఉంది.

ప్రస్తుతం తెలుగులో చేతినిండా ప్రాజెక్టులతో బిజీగానే ఉంది భాగ్య శ్రీ. ఇదిలా ఉంటే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన 38వ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విష్ చెసింది. 

రామ్‌తో కలిసి దిగిన ఒక అందమైన ఫోటోను పంచుకుంటూ భాగ్యశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ స్టోరీని పెట్టింది. ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

"హ్యాపీ బర్త్ డే రామ్.. జీవితంలోని ప్రతి విషయంలోనూ మనకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులు అంత సులభంగా తారసపడరు. నిన్ను చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉంటాను.

నీలాంటి ఒక మంచి స్నేహితుడు నాకు తోడుగా ఉన్నందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిని. ఈ ఏడాది నీ గర్జనల ప్రయాణం అడవి అంతటా గట్టిగా ప్రతిధ్వనించేలా ఉండాలని కోరుకుంటున్నాను"

అంటూ రామ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని సమాచారం. వీరి స్నేహం గురించి అప్పట్లో టాలీవుడ్‌లో గట్టిగా పుకార్లు వినిపించాయి.

ఈ రూమర్లపై ఇటు రామ్ కానీ, అటు భాగ్యశ్రీ కానీ ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు రామ్ పుట్టినరోజున భాగ్యశ్రీ  విష్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.