నిమ్మకాయ రసం చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. ఈ ట్రిక్స్ తెలుసా..?

Krishna

16 May 2026

ఎండలు ముదరడంతో ప్రతి ఇంట్లోనూ నిమ్మరసం వాడకం విపరీతంగా పెరిగింది. ఇది కేవలం శరీరాన్ని ఉత్తేజపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది.

వేసవిలో బెస్ట్ 

 నేటి కాలంలో మార్కెట్లో ఎన్నో రకాల ఎనర్జీ డ్రింక్స్, కొబ్బరి నీళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పూర్వ కాలం నుండి భారతీయ ఇళ్లలో వేసవి అనగానే మొదటి ప్రాధాన్యత నిమ్మరసానికే ఇస్తారు.

ప్రాచీన పానీయం

చాలా మంది మార్కెట్లో అమ్మే నిమ్మరసం చాలా రుచిగా ఉంటుందని అనుకుంటారు. ఇంట్లో కూడా అవే పదార్థాలు వాడినప్పటికీ అంతటి టేస్ట్ రాకపోవడానికి కారణం.. దాన్ని తయారీలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే.

 ఆ రుచి ఎందుకు రాదు

నిమ్మరసం చేసేటప్పుడు చాలా మంది చేసే మొదటి పొరపాటు.. నేరుగా చల్లటి నీళ్లలో చక్కెర వేసి కలపడం. చల్లటి నీటిలో చక్కెర అంత త్వరగా కరగదు, పైగా ఇలా చేయడం వల్ల నిమ్మరసానికి రావాల్సిన అసలైన చిక్కదనం రాదు.

చల్లటి నీళ్లలో చక్కెర 

మార్కెట్ స్టైల్ రుచి కావాలంటే.. ముందుగా పంచదారను కొద్దిగా వేడి నీటిలో కరిగించి చిక్కటి షుగర్ సిరప్ సిద్ధం చేసుకోవాలి. ఈ సిరప్ వాడటం వల్ల పంచదార నీటిలో పక్కాగా కలిసిపోయి నిమిషాల్లో రెడీ అవుతుంది.

పంచదార పాకం

 నిమ్మరసం తయారీలో అద్భుతమైన రుచి కోసం.. ముందుగా ఒక మిక్సర్ జార్ లేదా బ్లెండర్ తీసుకోవాలి. అందులో మనం తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్‌తో పాటు తగినంత నిమ్మరసాన్ని జోడించాలి.

మిక్సర్ వాడకం

 ఆ మిక్సర్ జార్‌లోనే నల్ల ఉప్పు, ఒక చిన్న నిమ్మకాయ తొక్క ముక్క, కొన్ని తాజా పుదీనా ఆకులు, బాగా నలిపిన మంచు ముక్కలు వేసి మిక్సీలో బాగా బ్లెండ్ చేయాలి.

సీక్రెట్ కాంబినేషన్

 ఇలా బ్లెండ్ చేసిన చిక్కటి మిశ్రమాన్ని చల్లటి నీటిలో కలిపితే.. ఎంతో రుచికరమైన, రిఫ్రెషింగ్ మార్కెట్ స్టైల్ నిమ్మనీళ్లు క్షణాల్లో సిద్ధమవుతుంది. ఇలా ఇంట్లోనే అమృతం లాంటి నిమ్మరసాన్ని ఆస్వాదించవచ్చు.

టేస్టీ లెమనేడ్