చిత్ర పరిశ్రమలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవడం కోసం హీరోయిన్లు శ్రమిస్తూ ఉంటారు. నటన, గ్లామర్‌తోనూ మెప్పించడానికి రెడీ అవుతుంటారు.
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్.
టాలీవుడ్‌లో ఈమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ, నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది.
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన 'హలో' సినిమాతో కళ్యాణి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయింది.
తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కొత్త కొత్త ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది ఈ అమ్మడు.
ఎప్పుడూ పద్ధతిగా, హోమ్లీ లుక్‌లో కనిపించే కళ్యాణి, ఈసారి రూట్ మార్చి స్టైలిష్ అండ్ హాట్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
డార్క్ పింక్ కలర్ షోల్డర్ లెస్ వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌లో ఆమె దిగిన ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ గ్లామరస్ డ్రెస్‌లో బ్యూటిఫుల్ స్టిల్స్ ఇచ్చింది.
ఈ సరికొత్త ట్రెండీ లుక్‌లో ఆమె అందం రెట్టింపు అయిందని, కళ్యాణిని ఇలాంటి బోల్డ్ లుక్‌లో చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదని క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.