Jayam Ravi : విడాకులు వచ్చేవరకు ఇక సినిమాల్లో నటించను.. హీరో జయం రవి సంచలన నిర్ణయం..
కోలీవుడ్ హీరో జయం రవి వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన భార్యతో విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కాడు. అదే సమయంలో నటి, గాయని కెనీషాతో అతడు ప్రేమలో ఉన్నారనే ప్రచారం సైతం నడుస్తుంది. అలాగే పలు సందర్భాల్లో వీరిద్దరు కలిసి ఈవెంట్స్, ఆలయాలకు కలిసి వెళ్లడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

తమిళ హీరో జయం రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. అయితే కొన్నాళ్లుగా సినిమాల గురించి కాకుండా వ్యక్తిగత విషయాలతో వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా భార్య ఆర్తితో విడాకుల వివాదం.. మరోవైపు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఇండస్ట్రీలో హాట్ హాపిక్ అయ్యింది. విడాకులు కాకముందే గాయనితో తిరగడం.. ఇద్దరు కలిసి ఈవెంట్స్, ఆలయాలకు వెళ్లడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. మరోవైపు ఆర్తి సైతం నెట్టింట తీవ్ర విమర్శలు చేసింది. దాదాపు రెండేళ్లుగా జయం రవి విడాకుల వివాదం నడుస్తుంది. తన భార్యతో డివోర్స్ కావాలంటూ కోర్టుకెక్కాడు జయం రవి. అయితే తనను సంప్రదించకుండానే తన భర్త విడాకుల గురించి నిర్ణయం తీసుకున్నారని ఆర్తి ఒక ప్రకటన చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Ananya Nagalla : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అలాంటి భర్త రావాలి.. హీరోయిన్ అనన్య నాగళ్ల..
ఆ తర్వాత ఇద్దరు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. మరోవైపు గాయని కెనీషాతో జయం రవి సన్నిహితంగా ఉండడంతో ఇద్దరు రిలేషన్ షిప్ పై మరిన్ని వార్తలు వినిపించాయి. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత, రవి మోహన్ , కెనీషా ఇద్దరూ బహిరంగంగా ఎక్కువగా కనిపించడం గమనార్హం. అయితే కెనీషా నిన్న ఒక వీడియోను విడుదల చేస్తూ.. ఈ విషయం తనను చాలా ప్రభావితం చేసిందని, తాను చెన్నైని విడిచి వెళ్ళిపోతున్నానని, ఇకపై రవి మోహన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోబోనని చెప్పారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా, ఇప్పుడు నటుడు రవి మోహన్ విలేకరులతో జరిపిన సమావేశం కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. విలేకరులతో మాట్లాడిన రవి మోహన్ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం వల్ల తానేమి దోషిని కాదని అన్నారు. తాను ఇన్నాళ్లు సహనం వహించానని, ఇకపై అలా ఉండబోనని అన్నారు. చాలా మంది తనను పంచ్ బ్యాగ్‌లా వాడుకున్నారని, విడాకులు వచ్చే వరకు తాను సినిమాల్లో నటించబోనని కూడా రవి మోహన్ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Chiranjeevi- Rajinikanth: రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్..
” నాకు విడాకులు వచ్చే వరకు నేను నటించను. నేను 23 ఏళ్లుగా పగలూ రాత్రీ కష్టపడ్డాను. నా సినిమాల్లో 90 శాతం విజయం సాధించాయి. మా నాన్న, మా సోదరుడు నాలుగేళ్లపాటు పని చేయలేదు. నేను చిన్నప్పుడు మా కుటుంబం కోసం పనిచేశాను. నేను మా కుటుంబం కోసమే ఇక్కడ ఉన్నాను. నా పిల్లలకు నన్ను నేను కనపడనీయలేదు. నేను నా పిల్లలను ఎలా వదిలిపెట్టగలను? నేను వారి కోసమే బ్రతికాను. కానీ ఈ రోజు నన్ను నా పిల్లలను చూడనివ్వడం లేదు. నన్ను సంరక్షకులతో పాటు పాఠశాలకు కూడా పంపిస్తున్నారు. నేను ఆ జీవితం నుండి పారిపోయాను. ఈ రోజు నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఒక మహిళ నన్ను అర్థం చేసుకుంది. ఇప్పుడు వాళ్ళు ఆమెను (కెనిషాను) కూడా బయటకు గెంటేశారు. నా పిల్లల కోసం నేను నోరు మూసుకున్నాను. మా అమ్మానాన్నలు నా కాళ్ళ మీద పడి ఆ అమ్మాయిని వద్దని వేడుకున్నారు. కొంచెం ప్రేమ ఉండి ఉంటే నేను వచ్చేవాడినా? జీవితంలో నా సర్వస్వం ఇచ్చేశాను. నా వ్యక్తిగత జీవితాన్ని చక్కదిద్దుకున్నాక తిరిగి వస్తాను. అప్పటి వరకు నేను ఏమీ చేయను. ” అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..
#Ravimohan's Emotional Pressmeet:
"My Films will not release on screens till i get my divorce.. I cannot act anymore.. I couldn't bear the insult I got.. If you want to provoke me.. try it.. I worked for 23yrs.. 95% of my films are successful.." pic.twitter.com/mJsr4QRf2q
— Laxmi Kanth (@iammoviebuff007) May 16, 2026
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆట సినిమాలో ఇలియనానను పెట్టుకున్నానని ఆ హీరోయిన్ అలిగింది.. నిర్మాత ఎం ఎస్ రాజు..
