తమిళ్ పై ఫోకస్ పెడుతున్న శ్రీలీల.. అక్కడ సత్తా చాటేనా.?

Rajeev 

15 May  2026

instagram

హీరోయిన్ శ్రీలీల.. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది. ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది.

కానీ కొన్ని నెలలుగా శ్రీలీల నటించిన సినిమాలు హిట్టు కావడం లేదు. అయినప్పటికీ ఈ బ్యూటీ అవకాశాలు మాత్రం తగ్గడం లేదు.

తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ ఈ సినిమాకూడా నిరాశపరిచింది.

ఇటీవలే పరాశక్తి సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేకపోయిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ తమిళంలో ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం హీరో ధనుష్, సాయి పల్లవి కాంబోలో వస్తున్న కొత్త ప్రాజెక్టులో నటిస్తుంది.

ఈ చిత్రానికి అమరన్ సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఇప్పుడు మరో ఛాన్స్ కొట్టేసిందట శ్రీలీల.