AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుచ్చకాయ తినాలంటే భయపడుతున్నారా? సమ్మర్‌లో బాడీ కూల్‌గా ఉండాలంటే ఈ పండు ట్రై చేయండి..

వేసవి కాలంలో తీవ్రమైన ఎండల కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని లోపలి నుండి చల్లగా, తేమగా (Hydrated) ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం కేవలం నీరు మాత్రమే కాకుండా నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినాలని నిపుణులు చెబుతుంటారు. అలాంటి పండ్లలో విదేశీ పండైన రాంబుటాన్ (Rambutan) ఒకటి. పైన జుట్టు వంటి నిర్మాణంతో, లోపల లీచీ పండులా ఉండే ఈ ఉష్ణమండల పండు శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది.

Jyothi Gadda
|

Updated on: May 16, 2026 | 1:32 PM

Share
శరీరానికి అద్భుతమైన హైడ్రేషన్: రాంబుటాన్ పండులో దాదాపు 80 శాతానికి పైగా నీటి కంటెంట్ ఉంటుంది. వేసవిలో చెమట రూపంలో శరీరం కోల్పోయే ద్రవాలను, అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి భర్తీ చేయడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. దీనిని తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. వేసవి అలసట తక్షణమే దూరమవుతుంది.

1 / 5
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ఈ పండులో విటమిన్ 'సి' (Vitamin C) పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుం. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

2 / 5
మెరుగైన జీర్ణక్రియ: రాంబుటాన్‌లో కరిగే కరగని పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారించి, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ సజావుగా సాగేలా చూస్తుంది.

3 / 5
చర్మ సౌందర్యం: ఇందులోని అధిక నీటి శాతం మరియు విటమిన్ సి చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేస్తాయి. ఇది చర్మంపై ముడతలను తగ్గించి, సహజమైన నిగారింపును ఇస్తుంది. ఈ పండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు తమ స్నాక్స్ సమయంలో దీనిని ఎలాంటి అపరాధ భావన (Guilt) లేకుండా హ్యాపీగా తినవచ్చు.

4 / 5
రాంబుటాన్ పండులో ఉండే కాపర్, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకల బలానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి, ఈ వేసవిలో కేవలం సాధారణ పండ్లకే పరిమితం కాకుండా, మార్కెట్లో దొరికితే గనుక ఈ రాంబుటాన్ పండును కూడా మీ డైట్‌లో చేర్చుకుని మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి.

5 / 5
Follow Us