AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED : Binance

బైనాన్స్ సెక్యూరిటీ గైడ్: మీ క్రిప్టో అకౌంట్‌ను సేఫ్‌గా ఉండాలా?.. 7 అడ్వాన్స్డ్ టూల్స్ వెంటనే ఆన్ చేసుకోండి

Binance Security Guide in Telugu: క్రిప్టో మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే చాలా మంది ట్రేడర్లకు ఒకటే భయం వెంటాడుతుంటుంది. తాము వాడుతున్న ప్లాట్‌ఫారమ్ నిజంగా సురక్షితమేనా అని? కానీ చేదైన నిజం ఏమిటంటే, చాలా సందర్భాలలో లోపం ప్లాట్‌ఫారమ్ భద్రతలో ఉండదు, యూజర్లు చేసే చిన్న చిన్న పొరపాట్లలోనే ఉంటుంది. కాబట్టి క్రిప్టో కోసం ఏ ఫ్లాట్‌పామ్ బెస్ట్, సేఫ్‌గా ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం.

బైనాన్స్ సెక్యూరిటీ గైడ్: మీ క్రిప్టో అకౌంట్‌ను సేఫ్‌గా ఉండాలా?.. 7 అడ్వాన్స్డ్ టూల్స్ వెంటనే ఆన్ చేసుకోండి
Binance Security Guide
Anand T
|

Updated on: May 15, 2026 | 4:37 PM

Share

క్రిప్టోలో ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు “అన్నిటికంటే సేఫ్ ప్లాట్‌ఫారమ్ ఏది?” అనే ప్రశ్న రావడం సహజం. ఈ విషయంలో బైనాన్స్ (Binance) ఒక ఉత్తమమైన యాప్, ఎందుకంటే ఈ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రజల రక్షణ కోసం అనేక అడ్వాన్స్డ్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. బైనాన్స్ తన యూజర్ల కోసం 2FA (టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్), విత్‌డ్రాయల్ వైట్‌లిస్ట్, యాంటీ-ఫిషింగ్ కోడ్, డివైజ్ మేనేజ్‌మెంట్, సెపరేట్ ఈమెయిల్ అండ్ పాస్‌వర్డ్, అలాగే బైనాన్స్ వెరిఫై, బైనాన్స్ విత్‌డ్రా వంటి ఎన్నో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లను అందుబాటులో ఉంచింది.

అథెంటికేటర్ యాప్‌ను ఉపయోగించండి

చాలా మంది తమ అకౌంట్ భద్రత కోసం టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) సెట్ చేసుకుంటారు. దీనివల్ల లాగిన్ అయ్యేటప్పుడు SMS OTP వస్తుంది కాబట్టి, ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే తెలిసిపోతుందని భావిస్తారు. ఇలా చేయడం మంచిదే, కానీ కేవలం దీనిపైనే ఆధారపడటం సరిపోదు. ప్రస్తుతం ‘సిమ్ స్వాప్ స్కామ్స్’ (SIM Swap Scams) బాగా పెరుగుతున్నాయి. అందుకే మీ అకౌంట్ బైనాన్స్‌లో ఉంటే, SMS OTP కి బదులుగా బైనాన్స్ అథెంటికేటర్ (Binance Authenticator) వాడటం సురక్షితం.

మీరు బైనాన్స్ యాప్ లేదా డెస్క్‌టాప్ వెబ్‌సైట్ ద్వారా ఈ ‘బైనాన్స్ అథెంటికేటర్’ను ఆన్ చేసుకోవచ్చు. ఇది చాలా సేఫ్ 2FA ఆప్షన్. ఎందుకంటే ఇది మీ పర్సనల్ డేటాను క్లౌడ్ స్టోరేజ్‌లో కాకుండా, నేరుగా మీ మొబైల్ డివైజ్ లోనే లోకల్‌గా స్టోర్ చేస్తుంది. బైనాన్స్ అథెంటికేటర్ సహాయంతో మీ అకౌంట్‌కు అదనపు రక్షణ లభిస్తుంది. దీనివల్ల హ్యాకర్లు మీ అకౌంట్‌ను హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యం అవుతుంది. యాప్ ద్వారా ఈ ఫీచర్‌ను ఆన్ చేయడానికి ఈ కింది పద్దతులను ఫాలో అవ్వండి.

  • మొదటగా మీ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి Security ఆప్షన్‌కు వెళ్లండి.
  • అక్కడ మీకు Authenticator App ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిని ఎనేబుల్ (Enable) చేయగానే మీకు 16 డిజిట్స్ (అంకెల) కీ (Key) వస్తుంది.
  • ఆ కీ ని ఎక్కడైనా సురక్షితంగా రాసి పెట్టుకోండి. ఒకవేళ మీ ఫోన్ పోయినా లేదా పాడైపోయినా, ఆ కీ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు.

యాంటీ ఫిషింగ్ కోడ్ (Anti-Phishing Code)

యాంటీ-ఫిషింగ్ కోడ్ అనేది మీ బైనాన్స్ అకౌంట్‌కు అదనపు రక్షణ కల్పించే ఒక అద్భుతమైన ఫీచర్. మీరు ఈ ఫీచర్‌ను ఒకసారి ఆన్ చేస్తే, బైనాన్స్ నుండి మీకు వచ్చే ప్రతి ఒరిజినల్ ఈమెయిల్ ,SMS లో ఈ కోడ్ కనిపిస్తుంది. కంపెనీ నుండి వచ్చే నిజమైన మెసేజ్‌లను, ఫేక్ మెసేజ్‌లను గుర్తించడానికి ఈ కోడ్ ఉపయోగపడుతుంది. దీనివల్ల మీరు ఫిషింగ్ లేదా స్మిషింగ్ స్కామ్స్ బారిన పడకుండా ఉంటారు. ఈ కోడ్ అనేది అక్షరాలు, నంబర్లతో కూడిన ఒక సీక్రెట్ కోడ్, దీనిని మీరే సొంతంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. బైనాన్స్ యాప్ లేదా సైట్ ద్వారా దీనిని సెటప్ చేయవచ్చు. యాప్‌లోకి లాగిన్ అయి, సెక్యూరిటీ సెక్షన్‌కు వెళితే అక్కడ మీకు ‘Anti-Phishing Code’ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు కోడ్ సెట్‌ చేసుకోవచ్చు.

విడ్రాయల్ వైట్‌లిస్ట్ (Withdrawal Whitelist) అంటే ఏమిటి?

బైనాన్స్ లోని విత్‌డ్రాయల్ వైట్‌లిస్ట్ అనేది ఒక ముఖ్యమైన సెక్యూరిటీ ఫీచర్. ఇది ఆన్ లో ఉంటే, మీ అకౌంట్ లోని క్రిప్టో ఫండ్స్ కేవలం మీరు ముందుగా అప్రూవ్ చేసి, వైట్‌లిస్ట్‌లో యాడ్ చేసిన వాలెట్ అడ్రస్‌లకు మాత్రమే విత్‌డ్రా అవుతాయి. దీనివల్ల ఒకవేళ హ్యాకర్లు మీ అకౌంట్ యాక్సెస్ చేసినా, వారి అపరిచిత వాలెట్లకు డబ్బును బదిలీ చేయలేరు. ఈ ఫీచర్‌ను ఆన్ చేయడానికి సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీ సెక్షన్‌కు వెళితే, అక్కడ మీకు Binance Withdrawal Protection ఫీచర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీరు ఈ ఫీచర్‌ను ఆన్ చేసుకోవచ్చు.

బైనాన్స్ డివైజ్ మేనేజ్‌మెంట్ (Binance Device Management)

ఈ డివైజ్ మేనేజ్‌మెంట్ ఫీచర్ ద్వారా మీ అకౌంట్ ఏయే ఫోన్లు, టాబ్లెట్లు లేదా కంప్యూటర్లలో లాగిన్ అయి ఉందో మీరు ట్రాక్ చేయవచ్చు, మేనేజ్ చేయవచ్చు. ఏదైనా కొత్త లేదా తెలియని డివైజ్ కనిపిస్తే వెంటనే దానిని రిమూవ్ చేయడం ద్వారా అనధికారిక యాక్సెస్‌ను అడ్డుకోవచ్చు.

ప్రత్యేక ఈమెల్, స్ట్రాంగ్‌ పాస్వర్డ్

అకౌంట్ భద్రతలో ఈమెయిల్, పాస్‌వర్డ్‌ల పాత్ర చాలా కీలకమైనది. మీ పర్సనల్ యూజ్ లేదా సోషల్ మీడియా కోసం వాడే ఈమెయిల్ ఐడీని క్రిప్టో ట్రేడింగ్ కోసం ఎప్పుడూ వాడకండి. ట్రేడింగ్ కోసం ప్రత్యేకంగా ఒక కొత్త ఈమెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోండి. అలాగే ఎవరూ ఊహించలేనంత స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి.

బైనాన్స్ వెరిఫై (Binance Verify)

బైనాన్స్ అఫీషియల్ సైట్ క్రింది భాగంలో ఉన్న సపోర్ట్ సెక్షన్‌లో మీకు ‘Verify’ ఆప్షన్ కనిపిస్తుంది. మీకు వచ్చిన ఏదైనా యుఆర్‌ఎల్ (URL), ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, టెలిగ్రామ్ ఐడీ లేదా సోషల్ మీడియా అకౌంట్‌ను అక్కడ ఎంటర్ చేసి… అది నిజంగా బైనాన్స్ అధికారిక మూలమేనా (Official Source) కాదా అని చెక్ చేసుకోవచ్చు.

అకౌంట్ హ్యాక్ అయితే ఏం చేయాలి?

ఒకవేళ మీ క్రిప్టో అకౌంట్ హ్యాక్ అయినా లేదా కాంప్రమైజ్ అయినా మొదట కంగారు పడకండి. ఎందుకంటే భయంలో తీసుకునే నిర్ణయాల వల్ల నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ అకౌంట్ హ్యాక్ అయితే ఈ కింది పద్దతులను పాటించండి

  • వెంటనే మీ పాస్‌వర్డ్‌ను మార్చేయండి.
  • అన్ని డివైజ్ల నుండి అకౌంట్‌ను ‘లాగ్ అవుట్’ (Log out) చేయండి.
  • వెంటనే బైనాన్స్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.
  • ఏదైనా ఫ్రాడ్ లేదా స్కామ్ జరిగినట్లు గుర్తిస్తే, వెంటనే National Cyber Crime Reporting Portal లో ఫిర్యాదు చేయండి.
  • లేదా సైబర్ ఫ్రాడ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.

చాలా మంది యూజర్లు ఈ సెక్యూరిటీ ఫీచర్లను ఎందుకు స్కిప్ (Skip) చేస్తారు?

పరిశోధనల ప్రకారం యూజర్లు సెక్యూరిటీ ఫీచర్లను స్కిప్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఈ కింద ఇచ్చనే చాలా మంది నెగ్లేట్ చేస్తారు.

  • తర్వాత చూసుకుందాం అనే నిర్లక్ష్యం: దాదాపు 65 శాతం మంది యూజర్లు తమ అకౌంట్‌కు ఏమీ కాదులే అనే ధీమాతో ఉంటారు. అందుకే తర్వాత చేసుకుందాంలే అనుకుంటారు.
  • ప్రాసెస్ కష్టంగా ఉంటుందనే అపోహ: నిజానికి ఈ ఫీచర్లను ఎనేబుల్ చేయడానికి కేవలం 2 నుండి 3 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కానీ చాలా మంది ఇది పెద్ద కష్టంతో కూడుకున్న పని అని చెప్పి నిర్లక్షం చేస్తారు.
  • అదనపు స్టెప్స్ వల్ల ఇబ్బంది: లాగిన్ అయ్యే ప్రతిసారీ అదనపు వెరిఫికేషన్లు చేయడం కాస్త విసుగ్గా అనిపిస్తుంది.
  • అవగాహన లేకపోవడం: అసలు ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయనే విషయమే 40శాతం మంది యూజర్లకు తెలియదు. అందుకే వీటిని పెద్దగా పట్టించుకోరు.
  • ఈ 7 సెక్యూరిటీ ఫీచర్లను ఆన్ చేయడానికి కేవలం 30 నుండి 45 నిమిషాల సమయం పడుతుంది. జస్ట్‌ మీరు ఆ టైంను దీనికి కేటాయిస్తే మీ లక్షల రూపాయల క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్‌ను సురక్షితంగా ఉన్నట్టే!

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.