హీరోలు వన్ మ్యాన్ షో.. హీరోయిన్స్ స్కిన్ షో..!! గ్లామర్ డాల్‌లా.. కథలో కీలక పాత్రలా..?
హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ డాలేనా? ఆమె బాహ్య సౌందర్యాన్ని చూపించడమే మూవీ మేకర్స్ లక్ష్యమా? ఒక డైరెక్టర్ మైండ్‌లో హీరో ఓరియెంటెడ్ కథ పుడితే.. హీరోయిన్‌కు ఇచ్చే స్కోప్ కేవలం అందాలను ఆరబోయడమేనా.? ఇప్పుడు ఇదే రచ్చ చినికి చినికి గాలివానలా మారింది

పెద్ది సినిమా కేంద్రంగా ఇప్పుడు చెలరేగిన కాంట్రవర్సీ ప్రతీ డైరెక్టర్‌కు ఒక లెస్సన్‌గా మిగిలిపోవాలి. ఎన్నో అంచనాలతో.. ఫుల్ క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా.. తొలిరోజు నుంచి మంచి టాక్ తెచ్చుకుంది కాని.. ఒక హీరోయిన్ విషయంలో వస్తున్న విమర్శలు డైరెక్టర్ బుచ్చిబాబును సైతం షేక్ చేశాయి. ఈ సినిమాలో హీరోయిన్‌ను అందాలు చూపించడానికి తప్ప.. వేరే స్కోప్ లేదంటూ చాలామంది విమర్శలు చేశారు. ఇలాంటి పాత్రలు సృష్టించి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారంటూ చాలామంది సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. అసలే పెద్ద హీరో చిత్రం. ఆయన పక్కన ఆడిపాడేందుకు హీరోయిన్ ఉండాల్సిందే. ఇది ఫక్తు తెలుగు సినిమా ఫార్ములా. దశాబ్దాల నాటి ఈ హిట్ ఫార్ములాకు ఇంకా కాలం చెల్లలేదా? అవే మూస ధోరణిని పట్టుకుని ప్రేక్షకులపై ఇంకా ఎన్నాళ్లు ఈ రుద్దుడు? ఇప్పటికే ఓటీటీల్లో హాలీవుడ్ టు కొరియన్ కంటెంట్ అందుబాటులోకి వచ్చేశాయి. ఈ తరుణంలో ఇంకా ఇలా హీరోయిన్ల శరీరంపై సీన్లు తీస్తూ డబ్బులు చేసుకుందామని ఆలోచిస్తారని ప్రేక్షకులు మండిపడుతున్నారు. పెద్దిలో జాన్వీ కపూర్ స్కిన్‌షోపై ఆడియన్స్ విసుగెత్తిపోయారు. మంచి స్పోర్ట్స్ డ్రామాలో ఇదేం హంగామా అంటూ పెదవి విరుస్తున్నారు. హీరోయిన్ అంటే ఆటలో అరటిపండు. సినిమాలో గ్లామర్ డాల్. తన అందాలను పార్టులు పార్టులుగా చూపించే ఓ పదార్ధంగా మార్చేశారు డైరెక్టర్లు. ఆమె కూడా మాటలొచ్చు, నటించడం వచ్చు, కథలో గ్లామరస్ సీన్లకే కాదు.. ఎమోషనల్ సీన్లకూ ఆమె సూట్ అవుతుందన్న జ్ఞానం మన దర్శకుల్లోనూ ఉంది. కాని.. ఆ క్రియేటివినీటి తొక్కిపట్టి.. మేల్ డామినేటెడ్.. హీరో ఓరియెంటెడ్ కథలు, సీన్లకే పరిమితం అవుతున్నారు.
ఇదే బుచ్చిబాబు తొలి సినిమాలో హీరోయిన్‌కు అద్భుతమైన క్యారెక్టర్ రాసుకున్నారు. కాని రెండో సినిమాకు మూస పాత్రను పట్టుకొచ్చారు. 80లు, 90ల్లోని హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌ను కల్పించారు. ఈ సినిమాలోనే కాదు.. జాన్వీకపూర్ నటించిన గత సినిమా కూడా అంతే. అందులోనూ ఆమె పాత్ర పెద్దగా ఏమి లేదు. అంతా వన్‌మ్యాన్ షో. ఇక్కడ మాత్రం స్కిన్ షో. ఒక సినిమా హిట్ అయిందంటే అందులో కంటెంటే ప్రధానం. బలమైన కంటెంట్ ఉన్న సినిమాకు ఈ హంగులు అవసరం లేదన్నది అందరికీ తెలుసు. అయితే.. మంచి కంటెంట్ రాసుకుని కూడా.. ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడం పైనే ప్రేక్షకుడి ఆగ్రహం. అమ్మాయిలను ఈ యాంగిల్‌లో చూపించడం ఆపేయాలి. ప్రేక్షకులు వచ్చి థియేటర్లో కూర్చున్న తర్వాత హీరోయిన్ నడుమో.. ఇంకేదైనా పార్టో చూపిస్తే ఫ్యామిలీ ప్రేక్షకులైనా.. మహిళలైనా ఎంత అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతారో దర్శకులు తెలుసుకోవాలి. ఒక వర్గం కోసమే సినిమా తీసేటట్లైతే ఇలా థియేటర్లలో కాకుండా ఓటీటీల్లోనే విడుదల చేసుకోండన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ది సినిమాకే ఈ పరిస్థితా అంటే కాదు.. ఇటీవల వచ్చిన పలు సినిమాల్లోని సీన్లు, పాటలు, స్టెప్పులపై విపరీతమైన ట్రోల్, మీమ్స్ వచ్చాయి.
మన దగ్గర మంచి డైరెక్టర్లు ఎంతోమంచి సినిమాలు తీస్తూ జాతీయస్థాయిలో అవార్డులు కొట్టి రోజులూ ఉన్నాయి. కళాతపస్వి కే.విశ్వనాథ్ అందులో ముందువరుసలో ఉంటారు. ఆయన సినిమాలోని హీరోయిన్లు నటిస్తారు. మెప్పిస్తారు. కన్నీరు తెప్పిస్తారు. ఆయన ఏరోజు కూడా సినిమాలో పాత్రలను కమర్షియలైజ్ చేయలేదు. సినిమాను సినిమాలా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లి.. అందరి గుండెల్లో నిలిచిపోయారు. బాపు సినిమాలంటే హీరోయిన్లకే పెద్దపీట ఉంటుంది. వారితోనే సినిమాను రక్తికట్టిస్తారు. నిండైన వస్త్రాలేసుకున్న హీరోయిన్లనే గ్లామర్‌గా చూపించగల సత్తా ఉన్న దర్శకుడాయన. ఆయన బొమ్మలు ఎంత అందంగా ఉంటాయో.. సినిమాలోని హీరోయిన్ కూడా అంతే అందంగా కనిపిస్తుంది. పదహారణాల తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎస్వీకృష్ణారెడ్డి, వంశీ, శేఖర్ కమ్ముల, నాగ్ అశ్విన్ వరకు హీరోయిన్లు తలెత్తుకునే పాత్రలను రాశారు. అలానే తీశారు కూడా. మహానటి అనే ఓ కల్ట్ ఫిల్మ్‌ను తీసి అశ్విన్ తన విశ్వరూపాన్ని చూపించారు. ఆయన ఏ సినిమా తీసినా.. హీరోయిన్‌కు సముచిత స్థానం ఇస్తూ వచ్చారు. నే వర్కౌట్ చేయాలనేది డైరెక్టర్ల ఫీలింగ్. మరి ఎవరి వాదన కరెక్టు.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
