నేను చేసిన చిన్నసాయానికి అతను నాకు కిడ్నీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.. : శివాజీ రాజా
నటుడు శివాజీ రాజా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన జీవితంలోని కీలక సంఘటనలు, వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. శారీరక గాయాలు మాత్రమే కాకుండా, అంతరంగిక వేదన కూడా "ప్రమాదమే" అని ఆయన ఈ సందర్భంగా నిర్వచించారు. అలాగే పలు సంఘటనలు వివరించారు.

టాలీవుడ్ నటుడు శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఎన్నో సినిమాల్లో సహాయకపాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు శివాజీ రాజా. ప్రస్తుతం శివాజీ రాజా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు శివాజీ రాజా. కాగా గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి రూ. 35,000 సహాయం చేయడం. అమృతం సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో, శంకర్ గౌడ్ అనే వ్యక్తి తన కుమారుడి గుండె ఆపరేషన్‌కు రూ. 35,000 అవసరమని, ఆ డబ్బు లేకపోతే స్వగ్రామానికి తిరిగి వెళ్ళలేను అని శివాజీ రాజాను వేడుకున్నాడట. అతని కష్టానికి కరిగిపోయిన శివాజీ రాజా అసిస్టెంట్ ద్వారా ఆ డబ్బును వెంటనే అందజేశారట. ఈ నిర్ణయాన్ని తన తోటి నటులు ప్రశ్నించినా, తనకు ఆ వ్యక్తి కష్టం నిజమనిపించిందని శివాజీ రాజా పేర్కొన్నారు. డబ్బు తీసుకున్న తర్వాత అతను మళ్లీ కనిపించలేదట.. రెండు, మూడు నెలల తర్వాత, ఊరి నుంచి ముగ్గురిని వెంటపెట్టుకుని వచ్చిన శంకర్ గౌడ్, శివాజీ రాజా కాళ్ల మీద పడి ఏడ్చాడట.
తన కుమారుడు క్షేమంగా ఉన్నాడని, కరీంనగర్ దగ్గర తమ ఊరికి జాతర ఉందని, శివాజీ రాజా రావాలని ఆహ్వానించాడట. శివాజీ రాజా వారి ఊరికి వెళ్లి, అక్కడి ప్రజల ఆదరాభిమానాలను పొందారు. శంకర్ గౌడ్ కుమారుడు శివాజీ రాజా ఫోటోను దేవుడి పక్కన పెట్టుకుని పూజించడం చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ సంఘటన తన జీవితంలో ఎన్నడూ పొందనంతటి ఆనందాన్ని ఇచ్చిందని శివాజీ రాజా తెలిపారు. కొన్నాళ్ల తర్వాత, శివాజీ రాజాకు యాక్సిడెంట్ అయినప్పుడు, కిడ్నీ సమస్య ఉందని తెలిసి, శంకర్ గౌడ్ తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడి 13 రోజులపాటు ఆసుపత్రిలోనే ఉన్నాడని, అది తనను తీవ్రంగా కదిలించిందని శివాజీ రాజా గుర్తు చేసుకున్నారు.
అలాగే తన తల్లిదండ్రులు తనపై చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. మణికొండలో తనకు వంద కోట్ల విలువైన స్థలం ఉందని, తాను వారిని సరిగా చూసుకోవడం లేదని ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారని తెలిపారు. ఒక తోటి ఆర్టిస్టే వారిని రెచ్చగొట్టి విషం నూరిపోశాడని శివాజీ రాజా ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు లేకపోతే తాను ఈ స్థితికి వచ్చుండేవాడిని కాదని, తన తల్లిదండ్రులను పోషించడం తన బాధ్యత అని, దీనికి కామన్ సెన్స్ అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ సంఘటన తనను మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని, ఆ సమయంలో పొసాని కృష్ణ మురళి, వేణు మాధవ్ మాత్రమే తనకు ఫోన్ చేసి మద్దతు ఇచ్చారని తెలిపారు. మిగిలిన వారంతా తప్పుగా అర్థం చేసుకున్నారని, కొందరు నీతులు చెప్పారని ఆయన వివరించారు. ఈ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత, తల్లిదండ్రులు తమ తప్పు తెలుసుకొని, తనను అర్థం చేసుకున్నారని, నిజంగా వంద కోట్లు ఉంటే తాను టీవీ సీరియల్స్‌లో ఎందుకు నటిస్తానని వారు అన్నారని తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
