వేసవిలో కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే

07 June 2026

Pic credit - Instagram

Phani Ch

రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, జ్యూస్‌లను ఎక్కువగా తీసుకుంటారు.

కొబ్బ‌రినీరు తాగ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేట్ అవుతుంది. కొబ్బరి నీళ్లు ఒక సహజసిద్ధమైన పానీయం. ఎలక్ట్రోలైట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది, డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్లు చాలా ఆరోగ్యకరమైనవి కూడా. కొబ్బరి నీళ్లను సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు.

కొబ్బరి నీళ్లలో తక్కువ కేలరీలు ఉంటాయి. కొబ్బ‌రినీరు తాగ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేట్ అవుతుంది. రోజుకి రెండుసార్లు కొబ్బ‌రి నీరు తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త‌పోటు కంట్రోల్‌లో ఉంటుంది.

 వేస‌విలో కొబ్బ‌రినీళ్లు తాగ‌డం వ‌ల‌న జీవ‌క్రియ‌ను కూడా పెంపొందించుకోవ‌చ్చు. దీంతో శరీర అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

కొబ్బ‌రినీటిలో ఉండే పోటాషియం శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంది. దీంతో సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

వేసవి కాలంలో వడదెబ్బ, డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉండాలంటే కొబ్బరి నీరు త‌ప్ప‌కుండా తాగాలి.