Vijay Deverakonda: ఆ నిర్మాత కష్టాలను విజయ్ వింటారా..!
ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఎన్నో అంచనాల మధ్య ఈ నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు విజయ్, ఆయన అభిమానులే కాదు.. ముఖ్యంగా ఈ మూవీపై నిర్మాత కేఎస్ రామారావు చాలా అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ క్రేజ్ దృష్ట్యా తనకు మంచి లాభాలు వస్తాయని ఆయన భావించారు. అయితే సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించకలేకపోయింది. దీంతో అటు నిర్మాత, ఇటు బయ్యర్లకు […]
ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఎన్నో అంచనాల మధ్య ఈ నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు విజయ్, ఆయన అభిమానులే కాదు.. ముఖ్యంగా ఈ మూవీపై నిర్మాత కేఎస్ రామారావు చాలా అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ క్రేజ్ దృష్ట్యా తనకు మంచి లాభాలు వస్తాయని ఆయన భావించారు. అయితే సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించకలేకపోయింది. దీంతో అటు నిర్మాత, ఇటు బయ్యర్లకు దారుణ నష్టాలు వచ్చాయి. ఇక బయ్యర్లను ఆదుకునే స్థితిలో నిర్మాత రామారావు కూడా ఇప్పుడు లేరు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు విజయ్‌ను కలవాలని రామారావు అనుకుంటున్నారట.
ఇప్పుడు బయ్యర్లను ఆదుకోకపోతే.. భవిష్యత్‌లో రామారావు సినిమాలు తీయడం ఇబ్బంది అవుతుంది. అందుకే విజయ్‌తో చర్చించి.. ఎంతోకొంత వారిని ఆదుకోవాలనే విషయంపై చర్చించాలని అనుకుంటున్నారట. కానీ మరోవైపు ఈ విషయంపై విజయ్ సానుకూలంగా స్పందించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కోసం విజయ్‌కు రామారావు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదట. కొంత పారితోషికం బకాయి పెట్టి, దానికి బదులు ఏవో ఫ్లాట్ పేపర్లు ఇచ్చారట. ఇక తనకే పూర్తిగా రెమ్యునరేషన్ ఇవ్వనప్పుడు బయ్యర్లను విజయ్ ఆదుకోవడం కష్టమేనని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నట్లు టాక్.