మాట మార్చిన వర్మ.. వారి బెదిరింపులే కారణమా..!

సంచలనాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రం ‘మెగా ఫ్యామిలీ’ అనే టైటిల్‌తో ఉండబోతుందని సోమవారం ప్రకటించాడు. అంతేకాదు దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మంగళవారం చెబుతానంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. దీంతో ఎప్పటిలాగే వర్మ ఏదో సంచలనానికి సిద్ధమయ్యాడనుకొన్న నెటిజన్లు.. ఏం చెప్తాడోనని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇదంతా తూచ్ అని చెప్పేసిన వర్మ.. తాను ఈ మూవీని చేయాలనుకోవడం లేదంటూ అందరికీ షాక్‌ను […]

మాట మార్చిన వర్మ.. వారి బెదిరింపులే కారణమా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Oct 29, 2019 | 6:20 PM

సంచలనాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రం ‘మెగా ఫ్యామిలీ’ అనే టైటిల్‌తో ఉండబోతుందని సోమవారం ప్రకటించాడు. అంతేకాదు దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మంగళవారం చెబుతానంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. దీంతో ఎప్పటిలాగే వర్మ ఏదో సంచలనానికి సిద్ధమయ్యాడనుకొన్న నెటిజన్లు.. ఏం చెప్తాడోనని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇదంతా తూచ్ అని చెప్పేసిన వర్మ.. తాను ఈ మూవీని చేయాలనుకోవడం లేదంటూ అందరికీ షాక్‌ను ఇచ్చాడు. అంతేకాదు దానికి ఓ నిర్వచనం కూడా ఇచ్చాడు.

‘‘మెగా ఫ్యామిలీ అనే చిత్రం ఒక వ్యక్తి, అతడికి చెందిన 39మంది సంతానంకు సంబంధించినది. ఇందులో చాలా మంది పిల్లలు ఉన్నారు. కానీ నేను చిన్న పిల్లల చిత్రాలను తీయలేను. అందుకే ఈ సినిమాను తీయడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు అందరూ ఉఫ్‌ అనుకున్నారు.

అయితే సోమవారం మెగా ఫ్యామిలీ అనే టైటిల్‌ను వర్మ ప్రకటించగానే.. మెగా ఫ్యాన్స్ నుంచి నెగిటివిటీ పెరిగింది. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, వర్మను దారుణంగా ట్రోల్ చేశారు. అంతేకాదు కొంతమంది బెదిరింపులు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఆయన వెనక్కు తగ్గాడని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వర్మ ఎన్నో సంచలనాత్మక సినిమాలు తీయగా.. వాటిపై పెద్ద పెద్ద వివాదాలే జరిగాయి. కానీ ఎన్ని వివాదాలు వచ్చినా.. ఎన్ని బెదిరింపులు వచ్చినా.. వర్మ అంత ఈజీగా వెనక్కి తగ్గడు. అలాంటిది ఇప్పుడు మాత్రం వర్మ అంత ఈజీగా అతడు వెనక్కి తగ్గడానికి గల కారణాలేంటో ఆయనే తెలియాలి మరి. కాగా ఏపీ రాజకీయాలపై ఆయన తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ ఇటీవల విడుదల అవ్వగా.. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్