వితిక చాలా రొమాంటిక్ గురూ.. హౌస్‌లో రొమాన్స్ పీక్స్!

‘బిగ్ బాస్’ సీజన్ 3లో జంటగా హౌస్‌లోకి ఎంటరైన భార్యాభర్తలు వరుణ్ సందేశ్, వితిక షేరు. ఈ జంట వచ్చిన మొదటి రోజు నుంచే రొమాంటిక్ చేష్టలతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. హగ్గులు, ముద్దులను దాటి ఈ జంట ఇప్పుడు రొమాన్స్ వరకు వెళ్లారు. శనివారం ఎపిసోడ్‌లో వీరిద్దరూ ఒకే దుప్పటిలో రొమాన్స్ చేసిన సన్నివేశం అభిమానుల్లో కాక పుట్టించింది. భర్తపై తన ప్రేమను వితిక ప్రతి ఎపిసోడ్‌లోనూ చూపిస్తూనే వచ్చింది. కొద్దిరోజుల క్రిందట వరుణ్ […]

వితిక చాలా రొమాంటిక్ గురూ.. హౌస్‌లో రొమాన్స్ పీక్స్!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 05, 2019 | 4:26 AM

‘బిగ్ బాస్’ సీజన్ 3లో జంటగా హౌస్‌లోకి ఎంటరైన భార్యాభర్తలు వరుణ్ సందేశ్, వితిక షేరు. ఈ జంట వచ్చిన మొదటి రోజు నుంచే రొమాంటిక్ చేష్టలతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. హగ్గులు, ముద్దులను దాటి ఈ జంట ఇప్పుడు రొమాన్స్ వరకు వెళ్లారు. శనివారం ఎపిసోడ్‌లో వీరిద్దరూ ఒకే దుప్పటిలో రొమాన్స్ చేసిన సన్నివేశం అభిమానుల్లో కాక పుట్టించింది.

భర్తపై తన ప్రేమను వితిక ప్రతి ఎపిసోడ్‌లోనూ చూపిస్తూనే వచ్చింది. కొద్దిరోజుల క్రిందట వరుణ్ తనని కాకుండా వేరొకరిని వెనకేసుకువచ్చాడని వితిక ఏడ్చిన విషయం తెలిసిందే. ఇక శనివారం ఎపిసోడ్ విషయానికి వస్తే.. బెడ్ రూంలో ఎవరూ లేకపోవడంతో వితిక.. వరుణ్ కప్పుకున్న దుప్పట్లో దూరి భర్తను కౌగిలించుకుని కొంచెం ఇంటిమేట్ అయ్యిందని చెప్పాలి. నీ హార్ట్ బీట్ వింటా.. హగ్ కావాలి అని అంటూ వరుణ్‌ను ప్రేమతో హత్తుకుంది. వరుణ్ అయితే ఏంటి ఇలా చేస్తున్నావ్.. ఓవరాక్షన్ చేయకు అంటూ రొమాన్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టాడు. కానీ కొద్దిసేపు మాత్రం వీరిద్దరి రొమాన్స్ చూసిన ప్రేక్షకులు మాత్రం తెగ ఎంజాయ్ చేశారు. బిగ్ బాస్‌ హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్లు ఒకవైపు.. వితిక షేరు మరోవైపు.. ఆమె వీలుచిక్కినప్పుడల్లా రొమాంటిక్ మూడ్‌లో వెళుతూ భర్తపై ఉన్న తన ప్రేమను చాటుకుంటుంది.