సేతుపతితో సమ్మోహనం బ్యూటీ!
‘సమ్మోహనం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది అదితి రావు హైదరి. ఆ సినిమా విజయంతో ఈ భామకు వరుసపెట్టి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో నాని సరసన ‘V’, రవితేజ సరసన ‘మహాసముద్రం’ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ తమిళంలో ధనుష్ సరసన ఓ సినిమా చేస్తోంది. వీటితో పాటు మరో తమిళ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అదితి రావు హైదరి. తాజా సమాచారం ప్రకారం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు […]

‘సమ్మోహనం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది అదితి రావు హైదరి. ఆ సినిమా విజయంతో ఈ భామకు వరుసపెట్టి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో నాని సరసన ‘V’, రవితేజ సరసన ‘మహాసముద్రం’ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ తమిళంలో ధనుష్ సరసన ఓ సినిమా చేస్తోంది. వీటితో పాటు మరో తమిళ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అదితి రావు హైదరి.
తాజా సమాచారం ప్రకారం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు ప్రసాద్ దీనదాయలన్ తెరకెక్కించనున్న ‘తుగ్లక్ దుర్బార్’ అనే చిత్రంలో అదితి రావు హైదరిని హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా.. వియాకామ్ 18 బ్యానర్ నిర్మిస్తోంది.