‘ఇస్మార్ట్ శంకర్’ నయా లుక్ అదరహో..!
రామ్ పోతినేని.. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా అతడు రెండు రోజుల క్రితం విదేశీ టూర్ ముగించుకుని వచ్చాడు. చిత్రం సక్సెస్ మీట్‌లో పాల్గొన్న రామ్.. చక్కటి క్లాస్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. క్లాసిక్ డ్రెస్ సెన్స్ ఫాలో అవుతూ గాగుల్స్‌లో రామ్ అప్పీరెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆసక్తికరంగా ట్రిమ్డ్ షేవ్ ఫేస్‌తో క్యాప్ పెట్టుకొని కనిపించాడు. ఇంతకీ ఈ మేక్ ఓవర్ నెక్స్ట్ సినిమా కోసమా లేక దీని వెనక […]
రామ్ పోతినేని.. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా అతడు రెండు రోజుల క్రితం విదేశీ టూర్ ముగించుకుని వచ్చాడు. చిత్రం సక్సెస్ మీట్‌లో పాల్గొన్న రామ్.. చక్కటి క్లాస్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. క్లాసిక్ డ్రెస్ సెన్స్ ఫాలో అవుతూ గాగుల్స్‌లో రామ్ అప్పీరెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆసక్తికరంగా ట్రిమ్డ్ షేవ్ ఫేస్‌తో క్యాప్ పెట్టుకొని కనిపించాడు. ఇంతకీ ఈ మేక్ ఓవర్ నెక్స్ట్ సినిమా కోసమా లేక దీని వెనక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.
కాగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా విడుదలై రెండు వారాలు ముగిస్తున్నా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ చిత్ర వసూళ్లు పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది.