తమిళ రిమేక్‌లో నటించనున్న హీరో విశ్వక్‌సేన్.. ఈ ఆఫర్ అతడికే ఎందుకు వచ్చిందో తెలుసా?
ఫలక్‌నుమా దాస్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన హీరో విశ్వక్ సేన్. హైదరాబాద్ లాంగ్వేజ్‌లో డైలాగులు చెబుతూ అందరిని
ఫలక్‌నుమా దాస్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన హీరో విశ్వక్ సేన్. హైదరాబాద్ లాంగ్వేజ్‌లో డైలాగులు చెబుతూ అందరిని ఆకట్టుకున్నాడు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. వినూత్న ప్రయోగం చేసి విజయం సాధించాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ తమిళ రిమేక్‌లో నటించనున్నాడు విశ్వక్.
ఎవరు చిత్రం తర్వాత నిర్మాత పీవీపీ చిన్న సినిమా తీసేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఓ మై కడవులే అనే తమిళ సినిమా రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు పలువురు హీరోలను కలిసినా ఉపయోగం లేకపోవడంతో విశ్వక్ సేన్‌తో ప్లాన్ చేస్తున్నారు. పూజా కార్యక్రమంతో ప్రారంభమైన ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. తరుణ్ భాస్కర్ చిత్రానికి డైలాగ్స్ అందిస్తుండగా, అశ్వథ్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్ సెల్వన్, రితికా సింగ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓ మై కడవులే’. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.