చరణ్ అజిత్ లు ఒకేసారి..!

చరణ్ అజిత్ లు ఒకేసారి..!

అమెజాన్ ప్రైమ్ వీడియో కు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో చాలా క్రేజ్ ఉంది. గత కొంతకాలంగా కొత్త సినిమాలను వీలైనంత తక్కువ రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇకపోతే ఈ ఏడాది మరీ స్పీడ్ పెంచి ‘ఎఫ్ 2’, ‘కథానాయకుడు’ సినిమాలను సరిగ్గా నెల రోజుల్లోనే ఆన్లైన్ స్ట్రీమ్ చేసింది.    ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ ఈ నెల 25న అఫీషియల్ గా అమెజాన్ ప్రైమ్ ద్వారా అందుబాటులోకి రానుంది. […]

Ravi Kiran

|

Feb 21, 2019 | 11:58 AM

అమెజాన్ ప్రైమ్ వీడియో కు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో చాలా క్రేజ్ ఉంది. గత కొంతకాలంగా కొత్త సినిమాలను వీలైనంత తక్కువ రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇకపోతే ఈ ఏడాది మరీ స్పీడ్ పెంచి ‘ఎఫ్ 2’, ‘కథానాయకుడు’ సినిమాలను సరిగ్గా నెల రోజుల్లోనే ఆన్లైన్ స్ట్రీమ్ చేసింది.   

ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ ఈ నెల 25న అఫీషియల్ గా అమెజాన్ ప్రైమ్ ద్వారా అందుబాటులోకి రానుంది. విచిత్రమేమిటంటే ఈ చిత్రం ఒరిజినల్ ప్రింట్ అప్పుడే ఆన్లైన్ లో హల్ చల్ చేస్తోంది. ఆఖరికి యుట్యూబ్ లో సైతం ఎవరో అప్ లోడ్ కూడా చేసేశారు. ఈ కారణంగా మార్చి 3న విడుదల చేద్దామనుకున్న ప్రైమ్ ముందుగానే రిలీజ్ చేయాలనీ అనుకుంటోందట.     

అయితే ఆ రోజునే తలా అజిత్ కుమార్ నటించిన తమిళ సూపర్ హిట్ సినిమా ‘విశ్వాసం’ కూడా అందుబాటులోకి రానుందట. ఇక ఈ సినిమా అటు తెలుగు, ఇటు కన్నడ భాషల్లో డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆన్లైన్ లోకి వస్తే తప్పకుండా డబ్బింగ్ వెర్షన్స్ కి ఎఫెక్ట్ పడుతుందంటున్నారు సినీ విశ్లేషకులు. తమిళ భాష రాకపోయినా సబ్ టైటిల్స్ సహకారంతో చూసే వీలున్నప్పడు ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడం అంత ఈజీ కాదని వారి మాట.

ఏది ఏమైనా 25వ తారీఖు అటు మెగా అభిమానులకు, ఇటు తలా అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి. అంతేకాదు ప్రేక్షకుల కోసం మరిన్ని సూపర్ హిట్ సినిమాల హక్కులు  అమెజాన్ ప్రైమ్ వద్ద ఉన్నాయట.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu