వరుణ్ లేకుండానే షూటింగ్ మొదలైంది

వరుణ్ లేకుండానే షూటింగ్ మొదలైంది

ఈ ఏడాది ఎఫ్ 2తో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న వరుణ్ తేజ్.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకిలో నటించేందుకు ఒప్పుకున్నాడు. తమిళంలో హిట్ అయిన జిగర్తాండ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుండగా.. మూవీ షూటింగ్ ఇవాళ ప్రారంభమైంది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ‘‘వాల్మీకి మొదటి రోజు షూటింగ్‌‌కు గుడ్ లక్. కొత్త టీమ్‌తో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’’ అంటూ వరుణ్ కామెంట్ పెట్టాడు. Goodluck for the first day shoot […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 21, 2019 | 1:48 PM

ఈ ఏడాది ఎఫ్ 2తో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న వరుణ్ తేజ్.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకిలో నటించేందుకు ఒప్పుకున్నాడు. తమిళంలో హిట్ అయిన జిగర్తాండ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుండగా.. మూవీ షూటింగ్ ఇవాళ ప్రారంభమైంది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ‘‘వాల్మీకి మొదటి రోజు షూటింగ్‌‌కు గుడ్ లక్. కొత్త టీమ్‌తో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’’ అంటూ వరుణ్ కామెంట్ పెట్టాడు.

అయితే ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన వరుణ్ తేజ్ ఈ మూవీ షూటింగ్‌లో త్వరలో పాల్గొనబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ్ విలన్‌గా కనిపించనుండగా.. తమిళ నటుడు అధర్వ హీరోగా నటించనున్నాడు. 14 రీల్స్ పతాకంపై గోపి అచంట, రామ్ అచంట నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. డీజే చిత్రంతో భారీ పరాజయాన్ని మూట గట్టుకున్న హరీశ్ శంకర్.. ఈ మూవీతో మళ్లీ ఫాంలోకి రావాలనుకుంటున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu