ఆధ్యాత్మిక బాటపట్టిన టాలీవుడ్ నటుడు

ఆధ్యాత్మిక బాటపట్టిన టాలీవుడ్ నటుడు

టాలీవుడ్ యాక్ట‌ర్ నితిన్ ఆధ్యాత్మిక బాటపట్టాడు. తాను హ‌నుమాన్ దీక్ష తీసుకున్న‌ట్టు ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. దీక్ష వ‌ల‌న తాను చాలా శాంతంగా ఉన్న‌ట్టు తెలిపాడు. ఉద‌యాన్నే 5 గంటలకి లేచిన త‌న‌కి శ్రీ ఆంజ‌నేయం సాంగ్స్‌తో డే స్టార్ట్ అవుతుంద‌ని అన్నాడు. ఆ త‌ర్వాత పూజా కార్య‌క్ర‌మాలతో బిజీ కానున్న‌ట్టు స్ప‌ష్టం చేశాడు. ఆధ్యాత్మిక‌త‌తో కూడిన వైబ్స్ నాలో స‌రికొత్త ఉత్సాహం ఇస్తుంద‌ని నితిన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న న‌టించిన లై […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 21, 2019 | 12:46 PM

టాలీవుడ్ యాక్ట‌ర్ నితిన్ ఆధ్యాత్మిక బాటపట్టాడు. తాను హ‌నుమాన్ దీక్ష తీసుకున్న‌ట్టు ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. దీక్ష వ‌ల‌న తాను చాలా శాంతంగా ఉన్న‌ట్టు తెలిపాడు. ఉద‌యాన్నే 5 గంటలకి లేచిన త‌న‌కి శ్రీ ఆంజ‌నేయం సాంగ్స్‌తో డే స్టార్ట్ అవుతుంద‌ని అన్నాడు. ఆ త‌ర్వాత పూజా కార్య‌క్ర‌మాలతో బిజీ కానున్న‌ట్టు స్ప‌ష్టం చేశాడు. ఆధ్యాత్మిక‌త‌తో కూడిన వైబ్స్ నాలో స‌రికొత్త ఉత్సాహం ఇస్తుంద‌ని నితిన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న న‌టించిన లై , చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలు పరాజయాన్ని మిగల్చ‌డంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు నితిన్‌ ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్.. త‌మిళ సూప‌ర్ హిట్ రీమేక్‌లో న‌టించేందుకు కూడా సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. ర‌ట్సాస‌న్ అనే త‌మిళ చిత్రం ఈ ఏడాది ఇండియాలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రాల‌లో రెండ‌వ స్థానంలో నిలిచింది. . ఈ చిత్రం తెలుగు హ‌క్కుల‌ని నితిన్ ద‌క్కించుకున్నాడ‌ని తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu