ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ మృతి
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ బర్జత్య కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్న ఆయన ముంబైలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ రాజశ్రీ వెల్లడించింది. తన తండ్రి తారాచంద్ బర్జత్య స్థాపించిన రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ప్రేమ్ రథన్ ధన్ పాయో’, ‘హమ్ సాథ్ సాథ్ హై’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘మై నే ప్యార్ కియా’ వంటి హిట్ చిత్రాలను రాజ్ కుమార్ నిర్మించారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో […]
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ బర్జత్య కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్న ఆయన ముంబైలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ రాజశ్రీ వెల్లడించింది. తన తండ్రి తారాచంద్ బర్జత్య స్థాపించిన రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ప్రేమ్ రథన్ ధన్ పాయో’, ‘హమ్ సాథ్ సాథ్ హై’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘మై నే ప్యార్ కియా’ వంటి హిట్ చిత్రాలను రాజ్ కుమార్ నిర్మించారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో మంచి సాన్నిహిత్యం కలిగిన రాజ్ కుమార్.. అతడికి నాలుగు గుర్తుండిపోయే హిట్లను ఇచ్చాడు. రాజ్ కుమార్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రాజ్ కుమార్‌కు సూరజ్ బర్జత్య అనే కుమారుడు ఉండగా.. ప్రస్తుతం రాజశ్రీ నిర్మాణ సంస్థను ఆయనే చూసుకుంటున్నాడు.