విజయ్ సేతుపతి నూతన చిత్రం ప్రారంభం
విజయ్ సేతుపతి…ఇప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. విభిన్న స్రిప్ట్స్ ఎంచుకుంటూ, విభిన్న రోల్స్ పోషిస్తూ, విభిన్న భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఎపిక్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఈ తమిళ హీరో. అస్సలు గ్యాప్ లేకుండా వరసబెట్టి సినిమాలు చేయడంలోనూ ముందే ఉన్నాడు. తాజాగా విజయ ప్రొడక్షన్స్ బ్యానరుపై బి.భారతి రెడ్డి నిర్మాణంలో విజయ్ సేతపతి హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతికి […]
విజయ్ సేతుపతి…ఇప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. విభిన్న స్రిప్ట్స్ ఎంచుకుంటూ, విభిన్న రోల్స్ పోషిస్తూ, విభిన్న భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఎపిక్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఈ తమిళ హీరో. అస్సలు గ్యాప్ లేకుండా వరసబెట్టి సినిమాలు చేయడంలోనూ ముందే ఉన్నాడు.
తాజాగా విజయ ప్రొడక్షన్స్ బ్యానరుపై బి.భారతి రెడ్డి నిర్మాణంలో విజయ్ సేతపతి హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతికి జోడీగా రాశిఖన్నా, నివేదా పెతురాజ్‌లు నటిస్తున్నారు. సుందరపాండియన్, రమ్మి చిత్రాల తర్వాత విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్నారు సూరి. నాజర్, రవికిషన్, మొట్టై రాజేంద్రన్, మారిముత్తు, జాన్ విజయ్‌లు ఇతర తారాగణం. వివేక్- మెర్విన్‌లు సంగీతం సమకూర్చుతున్నారు. వేల్‌రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పూజ కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. ఇందులో భారతిరెడ్డి, విజయ్‌సేతుపతి, విజయ్ చందర్, సూరి తదితరులు పాల్గొన్నారు.