‘ఉప్పెన’పై సేతుపతి కీలక వ్యాఖ్యలు.. ఆ మూవీ కంటే..!

మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. కోలీవుడ్‌ స్టార్ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కరోనా లేకపోయి ఉంటే […]

'ఉప్పెన'పై సేతుపతి కీలక వ్యాఖ్యలు.. ఆ మూవీ కంటే..!
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2020 | 2:38 PM

మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. కోలీవుడ్‌ స్టార్ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కరోనా లేకపోయి ఉంటే ఈ పాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేది.

కాగా ఈ మూవీ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను పంచుకున్నారు విజయ్ సేతుపతి. ఉప్పెన చాలా బావుంటుందని ఆయన అన్నారు. ఈ సినిమా తన కల్ట్ చిత్రం 96 కంటే బావుంటుందని సేతుపతి కితాబివ్వడం గమనర్హం. కాగా 96లో విజయ్ సేతుపతి, త్రిష నటించారు. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అటు విజయ్, ఇటు త్రిష కెరీర్లో గుర్తుండిపోయే మూవీగా నిలిచింది. అలాంటి 96 కంటే ఇప్పుడు ఉప్పెన బావుంటుందని విజయ్‌ ప్రశంసలు కురిపించడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తోన్న విజయ్‌ సేతుపతి.. ఉప్పెన రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.

Read This Story Also: మహేష్‌ సినిమాను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. కారణమిదేనా..!