AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. నాన్న తాగుడుకు అలవాటు.. అనాథశ్రమంలో పెరిగా.. హీరోయిన్ ఎమోషనల్..

సినీరంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితం అంత అందంగా ఉండదు. వెండితెరపై తమ నటనతో అలరించిన తారలు రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో చీకటి రోజులను గడుపుతుంటారు. ఇటీవల పలు ఇంటర్వ్యూలో తమ చిన్ననాటి చేదు జ్ఞాపకాలను పంచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు పలువురు హీరోయిన్స్. తాజాగా ఓ నటి తన లైఫ్ గురించి చెప్తూ బావోధ్వేగానికి గురైంది.

Tollywood : చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. నాన్న తాగుడుకు అలవాటు.. అనాథశ్రమంలో పెరిగా.. హీరోయిన్ ఎమోషనల్..
Tejaswi Madivada
Rajitha Chanti
|

Updated on: May 30, 2026 | 3:30 PM

Share

సినీరంగంలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో తేజస్వి మాదివాడ ఒకరు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. సినిమాల కంటే ఎక్కువగా ఆమె రియాల్టీ షోలు, టీవీ ప్రోగ్రామ్స్, వెబ్ సిరీస్ ద్వారానే పాపులర్ అయ్యింది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని తన ఆట తీరు, చలాకీతనంతో ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా హిందీలో పలు షోలలో పాల్గొని అక్కడ సైతం మరింత ఫేమస్ అయ్యింది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన లైఫ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

తేజస్వి మాట్లాడుతూ.. “నాన్న సింగరేణిలో పనిచేసేవాళఅలు. నాకు నాలుగేళ్లు ఉన్నప్పుడే మా నాన్నకు హైదరాబాద్ ట్రాన్ఫర్ అయ్యింది. దీంతో ఫ్యామిలీ మొత్తం ఇక్కడకు షిఫ్ట్ అయ్యాం. నాకు ఏడేళ్ల వయసులో మా అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. కొన్నాళ్లు చికిత్స తీసుకుంది. నాకు 11 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయాక నాన్న మందుకు అలవాటు పడ్డారు. అప్పుడు మా నాన్నను చూడాలంటే భయమేసేది. నాన్న తాగి ఎప్పుడూ తిడుతుండేవాడు. ఆయన టార్చర్ భరించలేక 18 సంవత్సరాలు రాగానే ఇంట్లో నుంచి పారిపోయాను. కొన్నాళ్లు అనాథశ్రమంలో ఉన్నాను. నాకు నేనే సోలోగా బతకడం నేర్చుకున్నాను” అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

ఎప్పుడు సరదాగా, సంతోషంగా కనిపించే తేజస్వి జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత తినడానికి తిండి లేక ఎంతో కష్టాలు పడ్డానని.. ఒక ఫ్రెండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వడంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సినీరంగంలో అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

తేజస్వి మాదివాడ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us
అమ్మ మరణం.. నాన్న వదిలేశాడు.. అనాథశ్రమంలోనే పెరిగా..
అమ్మ మరణం.. నాన్న వదిలేశాడు.. అనాథశ్రమంలోనే పెరిగా..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక RTCలో ప్రయాణం మరింత సౌకర్యవంతం
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక RTCలో ప్రయాణం మరింత సౌకర్యవంతం
దేవాలయాలలో స్త్రీలు అర్చకులుగా ఉండవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది..?
దేవాలయాలలో స్త్రీలు అర్చకులుగా ఉండవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది..?
ఓవర్సీస్‌లో పెద్ది టార్గెట్ ఎంతో తెలుసా..? భుజాలపై భారీ బాధ్యత
ఓవర్సీస్‌లో పెద్ది టార్గెట్ ఎంతో తెలుసా..? భుజాలపై భారీ బాధ్యత
కరుప్పుతో కమ్‌బ్యాక్.. ఇప్పుడు సూర్యకు అసలైన పరీక్ష మొదలు
కరుప్పుతో కమ్‌బ్యాక్.. ఇప్పుడు సూర్యకు అసలైన పరీక్ష మొదలు
వాషింగ్ మెషీన్‌లో ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలి? ఓవర్‌ లోడ్‌ అయితే?
వాషింగ్ మెషీన్‌లో ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలి? ఓవర్‌ లోడ్‌ అయితే?
టాలీవుడ్‌పైపు చూస్తున్న బాలీవుడ్ భామలు.. 2026లో హైదరాబాద్‌కే మకాం
టాలీవుడ్‌పైపు చూస్తున్న బాలీవుడ్ భామలు.. 2026లో హైదరాబాద్‌కే మకాం
కావేరి కాలింగ్ ఉద్యమం ద్వారా మెరుగైన ఫలితాలు
కావేరి కాలింగ్ ఉద్యమం ద్వారా మెరుగైన ఫలితాలు
హైదరాబాద్‌ నుంచి 36 మందితో బయల్దేరిన బస్సు.. సరిగ్గా అక్కడికి
హైదరాబాద్‌ నుంచి 36 మందితో బయల్దేరిన బస్సు.. సరిగ్గా అక్కడికి
ఇవి దశాబ్దాల పాటు ఆహారం లేకుండా కూడా జీవించగలవు
ఇవి దశాబ్దాల పాటు ఆహారం లేకుండా కూడా జీవించగలవు