సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

ఈ సమయంలోనే సెలబ్రిటీలు తమ ఇళ్లల్లో పనులు చేస్తూ.. ఇతరులకు ఛాలెంజ్‌లు విసురుతున్నారు. ఇలా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్శ ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలోనే ఆర్జీవీ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కే..

  • Tv9 Telugu
  • Publish Date - 1:53 pm, Wed, 22 April 20
సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నామైంది. లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు మినహాయిస్తే.. మిగతావన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు వెయ్యికి దగ్గరలో కరోనా కేసులు నమోదవడం ఇప్పుడు ప్రజలను, అధికారులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.

ఇక ఈ సమయంలోనే సెలబ్రిటీలు తమ ఇళ్లల్లో పనులు చేస్తూ.. ఇతరులకు ఛాలెంజ్‌లు విసురుతున్నారు. ఇలా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో యాంకర్.. మీరు ఎవరికి, ఎలాంటి ఛాలెంజ్ విసురుతారు? అన్న ప్రశ్నకు బదులుగా తాను తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కి ఛాలెంజ్ విసరాలనుకుంటున్నానని తెలిపారు. ఇక మరి ఆ ఛాలెంజ్‌ ఏంటని తెలిస్తే నిజంగానే షాక్ అవ్వక తప్పదు.

ఆ ఛాలెంజ్ ఏంటంటే.. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ టీవీలో అందరికీ కనిపించేలా గ్లాస్ విస్కీ తాగి.. ప్రేక్షకులకు షాక్ ఇవ్వాలన్నదే తన ఛాలెంజ్ అని తెలిపారు ఆర్జీవీ. ఏమైనా ఎవరినీ లెక్కచేయని టెంపరితనం వర్మదనే చెప్పాలి. కాగా ఇటీవల వర్మ తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితంపై ‘టైగర్ కేసీఆర్’ అనే బయోపిక్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Read More: 

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..