AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : కుర్చీలో బట్టలు వదిలేస్తున్నారా? ఇది తెలిస్తే జన్మలో అలా చేయరు!

చాలా మంది ఇళ్లలో ఉతికిన బట్టలు కుర్చీలో వేసి అలాగే వదిలేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అలా చేయడం అస్సలే మంచిది కాదంట, ఇది ఇంటి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 30, 2026 | 1:44 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే చాలా మంది తెలిసి తెలియక కుర్చీ లేదా సోఫా, మంచంపై బట్టలను వదిలేస్తూ ఉంటారు. కొన్ని సార్లు రోజులు గడుస్తున్నా, అవి కుర్చీపైనే ఉంటాయి. ఇది చాలా మందిలో ఉండే అతి పెద్ద అలవాటు, అయితే ఇలా బట్టలను వదిలి వేయడం అస్సలే మంచిది కాదంట, వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అనేక సమస్యలు కారణం అవుతుంది, ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో మానసిక ప్రశాంతత లోపించడం, ఆర్థిక సమస్యలు తలెత్తడం జరుగుతుందంట.

1 / 5
కుర్చీలు అనేవి గౌరవానికి సంబంధించినవి, అంతే కాకుండా అవి ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొస్తాయి. కానీ వాటిని అలాగే వదిలి వేయడం వలన అది ఇంటిలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీంతో ఇంటిలో ఉన్న వారి మధ్య కలహాలు జరగడం, ఒత్తిడి పెరగడం, బద్ధకం, చికాకు, వంటి అనేక ఇబ్బందులు ఏర్పడతాయంట.

2 / 5
ముఖ్యంగా ఇది ఆర్థిక వ్యవస్థపై లోతైన ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. సోఫా లేదా కుర్చీ పై మీరు బట్టలను వదిలి వేయడం వలన ఇది అప్పులను పెంచుతుంది. ఎంత కష్టపడినా సరే చేతిలో రూపాయి కూడా మిగలదు, ఖర్చులు అధికం అవుతాయి. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందంట. అందువలన మీ ఇంటిలో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండకూడదు అంటే వీలైనంత వరకు ఇంటిలో కుర్చీలో బట్టలు ఉండకూండా చూసుకోవాలి. ప్రతి క్షణం ఇంటిని శుభ్రం చేస్తూ ఉండాలంట.

3 / 5
అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో బట్టలు చిందరవందరగా ఉండటం, కుర్చీల్లో బట్టలు వదిలి వేయడం వలన ఇది ఏ పని చేయాలనే ఆసక్తి కలగకుండా చేస్తుంది, మానసిక ఒత్తిడి పెరిగి, బద్ధకం పెరిగేలా చేస్తుందంట. అలాగే కుటుంబ సభ్యుల్లో కలహాలు ఎక్కువ అవ్వడం ప్రతి క్షణం ప్రతి కూల ఆలోచనలు పెరగడం వంటి అనేక సమస్యలు కలిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు. అందువలన మీ ఇంటిలో ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు, చిక్కులు లేకుండా ఉండాలి అంటే తప్పకుండా ఉతికిన బట్టలను ఎప్పటికప్పుడు అల్మరాలో పెట్టాలంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us