AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు బిగ్ అలర్ట్.. అకౌంట్‌లో రూ.2వేలు పడేది అప్పుడే.. ఈ తప్పు చేస్తే పైసా రాదు..

PM Kisan: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు కీలక అలర్ట్ వచ్చేసింది. 9 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరుస్తూ, 23వ విడత నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నిధులు ఎప్పుడు వస్తాయి..? ఎవరికీ ఈ నిధులు రావు..? అనే విషయాలు తెలుసుకుందాం..

రైతులకు బిగ్ అలర్ట్.. అకౌంట్‌లో రూ.2వేలు పడేది అప్పుడే.. ఈ తప్పు చేస్తే పైసా రాదు..
Pm Kisan 23rd Installment Release Date
Krishna S
|

Updated on: May 30, 2026 | 1:40 PM

Share

దేశంలోని కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించబోతుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇవ్వబోయే 23వ విడత సొమ్మును జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. అంతకుముందు 22వ విడత నిధులను మార్చి 13న ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 9 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి విడతలో రూ. 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. రైతులకు వ్యవసాయాన్ని మరింత సులభతరం చేయడానికి, పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం 2018-19లో ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఏటా మూడు విడతల్లో మొత్తం రూ.6,000 ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందిస్తోంది. అయితే ఈసారి 23వ విడత డబ్బులు మీ ఖాతాలో పడాలంటే కొన్ని కీలకమైన రూల్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం.

వీరికి పీఎం కిసాన్ డబ్బులు రావు.. అర్హతలు ఇవే

పీఎం కిసాన్ పథకానికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ పథకం లబ్ధిదారులు కావాలనుకునే వారికి సొంతంగా వ్యవసాయ భూమి ఉండటం తప్పనిసరి. అయితే భూమి ఉన్నప్పటికీ కింది వారికి ఈ పథకం వర్తించదు:

వృత్తి నిపుణులు: ఇంజనీర్లు, వైద్యులు, లాయర్లు వంటి వారికి వ్యవసాయ భూమి ఉన్నా ఈ పథకానికి అర్హత లేదు.

రాజకీయ, ప్రభుత్వ ఉద్యోగులు: ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు ఈ పథకానికి అనర్హులు.

కుటుంబంలో ఒకరికే: ఒకే రేషన్ కార్డ్ లేదా ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఈ పథకం కింద లబ్ధి పొందలేరు.

కొత్తగా భూమి కొన్నవారు: 2019 సంవత్సరం తర్వాత వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన వారికి ఈ డబ్బు అందదు.

తల్లిదండ్రుల నుండి బదిలీ: తండ్రి లేదా తల్లి జీవించి ఉండగానే వారి నుండి వ్యవసాయ భూమిని తమ పేరుపై బదిలీ చేయించుకున్న వారికి కూడా ఈ పథకం వర్తించదు.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తనిఖీ చేసుకోండి:

మీరు ఇప్పటికే పీఎం కిసాన్ యోజన కోసం రిజిస్టర్ చేసుకుని ఉంటే, అధికారిక వెబ్‌సైట్ ద్వారా లబ్ధిదారుల జాబితాలో మీ పేరును సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే రైతుల విభాగం (Farmers Corner) కనిపిస్తుంది.
  • అక్కడ లబ్ధిదారుల జాబితా (Beneficiary List)పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, బ్లాక్, మీ గ్రామన్ని ఎంచుకోవాలి.
  • వివరాలన్నీ సబ్మిట్ చేయగానే మీ ప్రాంతంలోని లబ్ధిదారులందరి జాబితా వస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.

ఈ 3 పనులు చేయకపోతే 23వ విడత అస్సలు రాదు..

మీరు గతంలో పీఎం కిసాన్ డబ్బులు అందుకున్నప్పటికీ, ఈసారి 23వ విడత వస్తుందనే గ్యారెంటీ లేదు. కింది పనులు పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేసుకోవాలి.

eKYC వెరిఫికేషన్: రైతులు తమ ఖాతాకు తప్పనిసరిగా ఇ-కేవైసీ పూర్తి చేయించుకోవాలి.

భూమి రికార్డుల ధృవీకరణ : మీ వ్యవసాయ భూమి రికార్డులు అధికారికంగా వెరిఫై అయి ఉండాలి.

బ్యాంక్ – గుర్తింపు కార్డు అనుసంధానం: మీ బ్యాంక్ ఖాతాకు ప్రభుత్వ గుర్తింపు కార్డు, డీబీటీ ఆప్షన్ యాక్టివేట్ అయి ఉండాలి.

ఈ పనులు పూర్తి చేయని రైతులకు జూన్ నెలలో వచ్చే 23వ విడత రూ. 2,000 అకౌంట్‌లో పడవు బాస్. కాబట్టి వెంటనే మీ స్టేటస్ చెక్ చేసుకోండి.

Follow Us