వాక్సిన్ వస్తుంది.. ఈలోగా ఇదే దారి.. కరోనాపై సైంటిస్ట్ అడ్వైజ్
యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న తరుణం త్వరలోనే సాకరమవుతుందంటున్నారు పలువురు శాస్త్రవేత్తలు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడు వాక్సిన్ త్వరలోనే తయారవుతుందని వారు చెబుతున్నారు.

యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న తరుణం త్వరలోనే సాకరమవుతుందంటున్నారు పలువురు శాస్త్రవేత్తలు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడు వాక్సిన్ త్వరలోనే తయారవుతుందని వారు చెబుతున్నారు. ఈ కోవలోకి చేరారు ప్రముఖ వైరాలజిస్టు ఇయాన్ లిప్కిన్. అప్పటి దాకా సామాజిక దూరాన్ని పాటిస్తూ వీలైనంత ఇంటి పట్టునే వుండడమొక్కటే మార్గమని ఆయన సూచిస్తున్నారు.
కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ప్రఖ్యాత వైరాలజిస్ట్ ఇయాన్ లిప్కిన్ అన్నారు. అప్పటివరకూ సామాజిక దూరం పాటిస్తూ మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకోవాలని సూచించారు. ప్లాస్మా థెరఫీ ఎంతవరకూ ఉపయోగపడుతుందనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుందని అన్నారు.
కోవిడ్-19 గబ్బిలాల నుంచి మానవుడికి వ్యాపించిందని, దీన్ని ఎవరూ లేబొరేటరీల్లో సృష్టించలేదని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కరోనా వైరస్ అత్యంత భయానకపమైనదేమీ కాదని లిప్కిన్ వ్యాఖ్యానించారు. లిప్కిన్ చేసిన ఈ కామెంట్లు భయాందోళనలో వున్న వారికి ఎంతో కొంత ఊరట నిస్తున్నాయి.
కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పాతిక లక్షలు దాటాయి. మరణాల సంఖ్య వేగంగా రెండు లక్షలకు చేరువ అవుతోంది. సుమారు ఏడు లక్షల మంది కరోనా సోకిన తర్వాత ప్రాణాలతో బయటపడి, నెగెటివ్‌గా మళ్ళీ సాధారణ జీవనాన్ని గడుపుతుండడం ఎంతో కొంత ఆశావహంగా మారింది.
